ప్రకాశ్ రాజ్‌కు శ్రీనువైట్ల కౌంటర్, పవన్ కళ్యాణ్ అంటే..

By Srinivas

హైదరాబాద్: నటుడు ప్రకాశ్ రాజ్ తన పైన చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు ప్రకాశ్ రాజ్ ఆదివారం కౌంటర్ ఇచ్చారు. శ్రీను వైట్ల, పలువురు దర్శకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడారు. ఆగడు నుండి ప్రకాశ్ రాజ్‌ను తప్పించడానికి తన అహంకారం కారణం కాదని, ఆత్మాభిమానమే కారణమన్నారు.

సినిమా ఎలా తీయాలనేది ప్రకాశ్ రాజ్ నుండి తాను నేర్చుకునే స్థాయికి దిగజారలేదన్నారు. ప్రకాశ్ రాజ్ సినిమాలు, నిర్మాణాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదన్నారు. ఆయన తీసిన సినిమా ఫలితం అందరికీ తెలుసునని చెప్పారు. సినీ పరిశ్రమలో ఉంటూ సినిమాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

Srinu Vaitla counters Prakash Raj

సినిమా రన్నింగులో ఉన్నప్పుడు నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదన్నారు. మహేశ్ బాబు నటించిన ఆగడు సినిమాలో తాను ఎవరినీ ఉద్దేశించి సెటైర్లు వేయలేదన్నారు. ప్రకాశ్ రాజ్ తనను అహంకారం తగ్గించుకోమని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆయన మీద ఉన్న బ్యాన్లు, ఆంక్షలు ఎవరి పైనా లేవన్నారు. ఇక నైనా ప్రకాశ్ రాజ్ తన పని తాను చూసుకుంటే మంచిదన్నారు.

సినిమా పైనే బతుకుతూ సినిమా పైన ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ప్రకాశ్ రాజ్ తనకు అంకితమిచ్చిన కవితను ఆ హక్కుతోనే వాడుకున్నానని తెలిపారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని, ఎన్టీఆర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సినిమా నిర్మాణంలో ఉండగానే నెగిటివ్ ప్రచారం చేశారని ఆరోపించారు. క్యారెక్టర్ అవసరమైతే ప్రకాశ్ రాజ్‌తో సినిమా తీసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమే అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టడం ప్రకాశ్ రాజ్‌కు అలవాటు అని ఎద్దేవా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X