కష్టాల్లో రవితేజ సపోర్ట్, వారి వల్లే ఇంత లగ్జరీగా: శ్రీను వైట్ల
రవితేజ, ఇలియానా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'అమర్ అక్బర్ ఆంటోనీ'. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ.... మాస్ మహరాజ రవితేజ నా ట్రబుల్ షూటర్. నేను ఎప్పుడైనా డల్‌గా ఉన్నపుడు ఎనర్జీ ఇస్తాడు. మళ్లీ నన్ను పైకి తీసుకొస్తాడు. అలా వెంకీ, దుబాయ్ శీను సమయంలో చేశాడు. ఇపుడు అమర్ అక్బర్ ఆంటోనీ చేశాడని శ్రీను వైట్ల చెప్పుకొచ్చారు.

రవితేజ సపోర్టుతో ఛాలెంజెస్ తీసుకున్నా
రవితేజ నా మీద ఉన్న నమ్మకానికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. తను ఇచ్చిన ఎనర్జీతో ఈ సినిమా చేశాను. ఆయన సపోర్టుతో కొన్ని చాలెంజెస్ తీసుకున్నాను. దాన్ని వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది అన్నారు శ్రీను వైట్ల.

లగ్జరీగా చేసిన సినిమా ఇది
మేము ఏదైతే రాసుకున్నామో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. ఈ సినిమాను రెండు సీజన్లలో అమెరికాలో షూట్ చేయడం అంటే సాధ్యపడే విషయం కాదు. నేను చేసిన సినిమాల్లో లగ్జరీగా చేసిన సినిమాగా చెప్పొచ్చు. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైందని శ్రీను వైట్ల తెలిపారు.

తమన్, వెంకట్ సి దిలీప్ అదరగొట్టారు
వెంకట్ సి దిలీప్ అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించారు. మా తమన్ ఎక్స్‌ట్రార్డినరీ సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ అద్భుతమైన సెట్స్ వేసి సినిమా బాగా వచ్చేలా అంతా బాగా సెట్ చేశాడని వైట్ల తెలిపారు.

వారి సపోర్ట్ వల్లే...
ఈ సినిమాకు రైటర్లుగా పని చేసిన వంశీ, ప్రవీణ్, ప్రవీణ్ వర్మ ముగ్గురికీ థాంక్స్. బాలాజీ గారు రెండు అద్భుతమైన పాటలు రాశారు. శాస్త్రిగారు, విశ్వ కూడా మంచి పాటలు అందించారు. యూఎస్ఏలో షూట్ చేసినపుడు ప్రియాంక అనే అమ్మాయి మాకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బాగా హ్యాండిల్ చేశారు... ఇలా అందరూ సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందన్నారు.


Click it and Unblock the Notifications











