అదంతా ఫాల్స్ న్యూస్: శ్రీను వైట్ల
ట్వీట్ లో శ్రీను వైట్ల... " ఫిమేల్ లీడ్ గురించి.... అదంతా ఫాల్స్ న్యూస్..మేమింకా ఎవరనేది ఫైనల్ చేయలేదు... ఆ హీరోయిన్ ఎవరు అనేది త్వరలోనే నేనే తెలియచేస్తాను .." అని స్పష్టం చేసారు. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల విజయం వెనక శ్రీను వైట్ల టాలెంట్‌తో పాటు గోపీ మోహన్, కోన వెంకట్ లాంటి రచయితల కృషి కూడా దాగి ఉంది.
'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకునే పనిలో ఉన్నాడట శ్రీను వైట్ల.
శ్రీను వైట్ల దర్శకత్వం మొదలు పెట్టి 15 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఆయన 13 సినిమాలకు దర్శకత్వం వహించారు. తొలి నాళ్లలో వచ్చిన నీ కోసం, ఆనందం, సొంతం లాంటి చిత్రాలకు శ్రీను వైట్ల సొంతంగా స్క్రిప్టు రాసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో చేయి కలిపారు గోపీ మోహన్. ఢీ, రెడీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి చిత్రాలతో పాటు 8 చిత్రాలకు కథ అందించారు.
అయితే చాలా కాలం తర్వాత మళ్లీ సొంతగా స్టోరీ రాయడం మొదలు పెట్టారు శ్రీను వైట్ల. 'ఆగుడు సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యుడొకరు మీడియాతో మాట్లాడుతూ దూకుడు తర్వాత శ్రీను వైట్ల మహేష్ బాబుతో ఆగడు సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఆయనే సొంతంగా స్టోరీ రెడీ చేసుకుంటున్నారు' అని తెలిపారు. దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications












