శ్రీను వైట్ల ‘D’ సెంటిమెంట్ సక్సెస్
దర్శకుడు శ్రీను వైట్ల సినిమా 'దూకుడు" సూపర్ సక్సెస్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఈ సినమా టైటిల్ విషయంలో మన దర్శకుడు ఓ సెంటిమెంటు ఫాలో అయ్యాడట. అదేమిటంటే సినిమా టైటిల్ లో 'D" అనే అక్షరాన్ని వచ్చేలా చూసుకోవడమే ఆ సెంటిమెంటు వెనక ఉన్న రహస్యం. ఆయన రూపొందించిన Dhee, Ready, Dubai Seenu సినిమాలు మంచి విజయం సొంతం చేసుకున్నాయి. వీటి తర్వాత ఆయన రూపొందించిన నమో వెంకటేష సినిమా ఘోరమైన ప్లాపుగా నిలిచింది. నమో వెంకటేశ సినిమా ప్లాపు కావడానికి కారణం ఆ సినిమా టైటిల్ లో D అనే అక్షరం లేక పోవడమే అని భావించిన శ్రీను వైట్ల తన తర్వాతి సినిమా Dookuduలో డబుల్ D వచ్చేలా చేసి రెండు సినిమాల సక్సెస్ ఒకే సారి పొందాడు.
D తన లక్కీ అక్షరంగా భావిస్తున్న శ్రీను వైట్ల ఇకపై తన ప్రతి సినిమాలోనూ D అక్షరాన్ని కొనసాగించాలని డిసైడైనట్లు తెలుస్తోంది. మరి శ్రీను వైట్ల నమ్ముతున్న ఈ సెంటిమెంటు నిజంగానే పని చేస్తుందా? లేక కాకతాళీయంగా జరిగిందా? అనేది మరో సినిమా విడుదలైతేగానీ తెలీదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దూకుడు సినిమాను హిందీలో రూపొందించిన బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











