వర్మపై రివేంజ్ తీర్చుకుంటున్న శ్రీను వైట్ల
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ మధ్య తను రూపొందించిన 'కథ, స్ర్ర్కీన్ ప్లే, దర్వకత్వం అప్పల్రాజు" సినిమాలో దర్శకులను, పలువురు సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ...ఓ పేరడీ సాంగు పెట్టిన విషయం తెలిసిందే. అందులో తనను తాను విమర్శించుకోవడంతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు పూరి జగన్నాథ్, రాజమౌళి, శ్రీనువైట్ల తదితరులపై కూడా సెటైర్లు విసిరాడు వర్మ. ఆ పాటలో శ్రీను వైట్లను ఉద్దేశించి ''నమో వెంకటేశ అన్న శ్రీను వైట్లకి పంగనామాలే మిగిలాయి"" అంటూ ఎత్తిపొచాడు వర్మ.
ఈ నేపథ్యంలో తనపై సెటైర్లు వేసిన వర్మపై...తన తాజా సినిమా 'దూకుడు"లో సెటైరిక్ సన్నివేశం పెట్టాడు శ్రీను వైట్ల. తనకు ఇబ్బంది కలిగించిన వారిపై తన సినిమాలో సెటైరిక్ సీన్లు ప్లాన్ చేయడం వైట్లకు అలవాటే. గతంలో తనను ఇబ్బందులకు గురి చేసిన ఓ ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్లను ఉద్దేశించి రెడీ, ఢీ, కింగ్ సినిమాల్లో సెటైరిక్ సన్నివేశాలు ప్లాన్ చేశాడు. తాజాగా ప్రేక్షకులకు అర్థం అయ్యే రితిలో దూకుడు సినిమాలో వర్మపై ఓ కామెడీ సీన్ల ప్లాన్ చేశాడట శ్రీను వైట్ల. అప్పడు కెఎస్ డి అప్పలరాజు సినిమాలో తనపై వచ్చిన కామెడీ ట్రాకును ఉద్దేశించి నవ్వుకున్న వారంతా...ఇప్పడు వర్మ పై వచ్చిన కామెడీ ట్రాకును చూసి నవ్వుకుంటుండటంతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.


Click it and Unblock the Notifications











