‘ఆగడు’ టాస్క్ ఓవర్....నెక్ట్స్ రామ్ చరణ్ టాస్క్!
హైదరాబాద్: దర్శకుడు శ్రీను వైట్ల ‘ఆగడు'ను సినిమాను విజయవంతంగా పూర్తి చేసారు. హీరో మహేష్ బాబుతో పాటు, నిర్మాతలు ఆయన పని తనానికి ఫుల్ మార్కులే వేసారు. ఇక మిగిలి ఉందల్లా ప్రేక్షకులు ఆయన సినిమాకు ఎన్ని మార్కులు వేస్తారనే విషయమే. రేపు ‘ఆగడు' సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
సినిమా విడుదలను పురస్కరించుకుని దర్శకుడు శ్రీను వైట్ల సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈనంతరం ఆయన మాట్లాడుతూ తన ప్రతి సినిమా విడుదల ముందు స్వామి వారిని దర్శించుకోవడం అలవాటు. స్వామి వారి ఆశీస్సులు ఉంటే విజయం వరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా శ్రీను వైట్ల తన తర్వాతి సినిమా గురించిన వివరాలు వెల్లడించారు. రామ్ చరణ్ తో తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ వార్త మెగా అభిమానులకు సంతోషకరమైనదే ఎందుకంటే యాక్షన్ ని జోడిస్తూ పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందించడం శ్రీను వైట్ల సొంతం.
ప్రస్తుతం చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే 'చిత్రం చేస్తున్నాడు, ఇది పూర్తి కాగానే కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మించనున్నాడు ,ఇంతకుముందు చరణ్ తో 'నాయక్ ' చిత్రాన్ని నిర్మించాడు దానయ్య. శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు,ఈ చిత్రం కూడా శ్రీను వైట్ల తరహాలోనే వినోద ప్రధానంగా రూపొందనుంది.


Click it and Unblock the Notifications











