ఒక సినిమా హిట్టయితే ఆ దర్శకుడుకి భలే డిమాండు. ఎక్కడెక్కడి హీరోలు,నిర్మాతలు ఆ దర్శకుడుతో సినిమాలు చెయ్యటానికి ఉబలాటపడతారు. అందుకనే సినీ ఫీల్డ్ ...సక్సెస్ మేటర్స్ అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్ధితిని దర్శకుడు శ్రీను వైట్ల అనుభవిస్తున్నాడు. 'ఢీ', 'దుబాయ్ శీను' ,ఇప్పుడు 'రెడీ' హిట్ టాక్ శ్రీను వైట్లను క్రేజ్ పరంగాఎక్కడికో తీసుకెళ్ళింది. అంతేగాక 'రెడీ' సినిమాకు ఓపెనింగ్స్ కూడా అనూహ్య రీతిలో వుండటంతో దర్శకుడిగా శ్రీను వైట్ల మరింత డిమాండును సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అతను హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. శ్రీను ప్రస్తుతం నాగార్జున హీరోగా 'కింగ్'ను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానున్నది. దాని తర్వాత అతను వెంకటేష్‌ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను 'ఆంధ్రావాలా' నిర్మాత గిరి, నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ (ఏషియన్ ఫిలిమ్స్) సంయుక్తంగా నిర్మించనున్నారు. వెంకటేష్ ఇప్పుడు 'చింతకాయల రవి'గా నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన నటించేది శ్రీను దర్శకత్వంలోనే. ఈ యేడాది ఆఖరు లేదా వచ్చే యేడాది ఆరంభంలో ఈ సినిమా మొదలు కానున్నది. అంటే మరో కామిడీ రెడీ కాబోతోందన్నమాట.