బండ్ల గణేష్ ‘బాద్ షా’ ఛాన్స్ వెనక... పచ్చి నిజాలు!

By Bojja Kumar

హైదరాబాద్: ఉన్నట్టుండి బండ్ల గణేష్ ఇండస్ట్రీలో భారీ నిర్మాత అయ్యాడు. టాప్ దర్శకులు, టాప్ హీరోలంతా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూస్తున్నారు. ప్రస్తుతం గణేష్ చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. గణేష్ లాంటి సాధారణ ఆర్టిస్టు ఉన్నట్టుండి ఇంత పెద్ద నిర్మాత ఎలా అయ్యాడు అనే ప్రశ్న చాలా కాలం క్రితమే తలెత్తింది. గణేష్ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అనే దానికి రకరకాల సమాధానాలు వినిపించాయి కూడా.

అయితే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద నిర్మాతలు తమతో సినిమా చేయాలని వెంట పడుతున్నా వారిని కాదని.... స్టార్ హీరోలు, దర్శకులు బండ్ల గణేష్‌‌కు అవకాశాలు ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటి? అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సరైన సమాధానం దొరకలేదు. తాజాగా దీని వెనక ఉన్న అసలు రహస్యం బట్టబయలైంది.

గణేష్ వారిని ఒప్పించడానికి ముందువారికి పర్సనల్‌గా దగ్గర అవుతారు. వారికి కావాల్సింది ఏమిటి? అనే విషయం గ్రహించి వాటిని సమకూర్చుతాడు. తన వల్లే అయ్యే పనులు చేసి పెడతాడు. తద్వారా వారి ప్రేమాభిమానాలు పొందుతాడు. ఆ తర్వాత మెల్లిగా సినిమా అవకాశాలు రాబట్టుకుంటాడు. ఇదే బండ్ల గణేష్ అవలంభిస్తున్న సూత్రం.

ఇదంతా మేము ఏదో ఊహించి చెబుతుంది కాదు. ఇటీవల బాద్ షా హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో దర్శకుడు శ్రీను వైట్ల ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. 'బండ్ల గణేష్ పర్సనల్ గా నాకు చాలా హెల్ప్ చేసాడు. పాజిటివ్ యాటిట్యూడ్‌తో మనుషుల్ని గెలిచే వ్యక్తిత్వం ఆయనది. ఓసారి కలిసి సినిమా చేద్దాం అన్నాడు.... వెంటనే ఒప్పుకున్నాను' అని శ్రీను వైట్ల వెల్లడించారు.

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత కావాలంటే స్టార్ హీరోలు, స్టార్ దర్శకులతో చేసే అవకాశం దక్కించుకుంటే చాలు. మన దగ్గర డబ్బు లేకున్నా.... స్టార్ హీరోలు, దర్శకుల సినిమాలు కాబట్టి డబ్బు అరేంజ్ చేయడానికి సినీ ఫైనాన్సియర్లు రెడీగా ఉంటారు. అదే మరి బండ్ల గణేష్ ఎదుగుదల వెనక ఉన్న రహస్యం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X