'దూకుడు' రికార్డులపై శ్రీనువైట్ల ఆశ్చర్యం
మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తుందని తాను అస్సలు ఊహించలేదని చిత్ర దర్శకుడు శ్రిను వైట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు. దూకుడు సినిమా రాష్ట్ర వ్యాప్తతంగా అన్ని ధియోటర్స్ లో విజయవంతగా ప్రదర్శస్తున్న సందర్భంగా ఆ చిత్ర యూనిట్ అభిమానులను నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపేందుకు చేపట్టిన యాత్రలో భాగంగా ఏలూరులోని సత్యనారాయణ ధియోటర్ కి విచ్చేసారు. దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ... దూకుడు సినిమా విజయం సాధిస్తుందని ఊహించామని,కానీ రికార్డులు తిరగరాసే స్ధాయిలో ఘన విజయం సాధిస్తుందనుకోలేదని అన్నారు. ఈ సినిమాని త్వరలో హిందీలో తెరక్కించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే యేడాది మహేష్ బాబుతో మరో చిత్రం తీస్తానని అన్నారు. ఇఖ బాలీవుడ్ లో హీరో ఎవరనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా తీసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.
మరో ప్రక్క మహేష్ తన హిందీ రీమేక్ కు సల్మాన్ ఖాన్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు అని ఓ డైలీతో మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే గతంలో తన పోకిరి చిత్రాన్ని సల్మాన్ రీమేక్ చేసి హిట్ కొట్టడం గుర్తు చేసి చెప్తున్నాడు. ఇక దూకుడు నిర్మాతలే హిందిలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచలో ఉన్నారుట. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే అక్షయ్ కుమార్ ట్రైల్స్ వేస్తున్నారు. మరో ప్రక్క అజయ్ దేవగన్ కూడా తన నిర్మాతలను ఈ సినిమా కోసం పంపుతున్నాడు. ఇక మహేష్ మాటను సల్మాన్ పాజిటివ్ గా తీసుకుని ముందుకు వచ్చి ఈ రీమేక్ ప్రారంభించే అవకాసం ఉంది. ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్ రీమేక్ లో ఉన్నారు. అలాగే మొన్నే బాడీగార్డు,రెడీ రీమేక్ లు చేసారు. మరో ప్రక్క తెలుగులో హిట్ అయిన కాంచన చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ అన్ని భాషల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోలు సైతం కామిడీ సినిమాలు అంటేనే ఆసక్తి చూపుతూ వాటిమీదే కాన్సర్టేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











