twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' టైటిల్ అప్పుడు స్ఫురించింది

    By Srikanya
    |

    "దూకుడు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదు. కథ వినగానే మహేష్ 'ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్' అని అన్నారు. మహేష్‌ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా తెరమీద ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నప్పుడు నా కళ్ళ ముందు తెల్లటి చొక్కా, పులిగోరు చెయిన్‌తో మహేష్ ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు. దాన్నే తెరమీద చూపించాం. ఇంకో రోజు ట్రెడ్‌మిల్ చేస్తుంటే 'దూకుడు' అనే టైటిల్ స్ఫురించింది. ఇందులోని ప్రతి సీనూ, ప్రతి డైలాగూ మహేష్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినవే అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల.మహేష్, సమంత నటించిన 'దూకుడు' ఇటీవల విడుదలై పరిశ్రమ రికార్డుల్ని బద్ధలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం విదితమే. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే "దూకుడు పెద్ద విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిని నిలబెట్టుకోవాలనే టెన్షన్ కూడా ఉంది'' అని అంటున్నారు శ్రీనువైట్ల.

    మరో ప్రక్క మహేష్ తన హిందీ రీమేక్ కు సల్మాన్ ఖాన్ అయితేనే న్యాయం చేయగలుగుతాడు అని ఓ డైలీ తో మాట్లాడుతూ అన్నారు. ఎందుకంటే గతంలో తన పోకిరి చిత్రాన్ని సల్మాన్ రీమేక్ చేసి హిట్ కొట్టడం గుర్తు చేసి చెప్తున్నాడు. ఇక దూకుడు నిర్మాతలే హిందిలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచలో ఉన్నారుట. ఇక ఈ చిత్రం కోసం ఇప్పటికే అక్షయ్ కుమార్ ట్రైల్స్ వేస్తున్నారు. మరో ప్రక్క అజయ్ దేవగన్ కూడా తన నిర్మాతలను ఈ సినిమా కోసం పంపుతున్నాడు. ఇక మహేష్ మాటను సల్మాన్ పాజిటివ్ గా తీసుకుని ముందుకు వచ్చి ఈ రీమేక్ ప్రారంభించే అవకాసం ఉంది. ఇక సల్మాన్ ప్రస్తుతం కిక్ రీమేక్ లో ఉన్నారు. అలాగే మొన్నే బాడీగార్డు,రెడీ రీమేక్ లు చేసారు. మరో ప్రక్క తెలుగులో హిట్ అయిన కాంచన చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక దూకుడు కలెక్షన్స్ అన్ని భాషల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోలు సైతం కామిడీ సినిమాలు అంటేనే ఆసక్తి చూపుతూ వాటిమీదే కాన్సర్టేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Director Seenu Vaitla has confirmed that he would be directing Hindi version of Dookudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X