ఆ తిట్లు నా సెంటిమెంట్ : శ్రీను వైట్ల
అలా కామెడీ చేసే దృశ్యాలు దర్శకుడు శ్రీనువైట్ల చిత్రాల్లో తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే, అది అతడి సెంటిమెంట్ సీను అని చెబుతున్నారు. ఆ విషయమై ఆయన్ని మీడియా ప్రశ్నించింది.
దానికి కారణం వివరిస్తూ....'ఆనందం సినిమాలో కామెడీ కోసం ఓ తిట్ల సీను పెట్టాను. దాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆ తరువాతి చిత్రంలోనూ అదే తరహా దృశ్యానికి కూడా మంచి ప్రశంసలు లభించాయి.
దాంతో నా చిత్రాల్లో తిట్ల సీను వస్తూనే ఉంది. ప్రత్యేకంగా తిట్లను పెట్టాలన్న ఉద్దేశంతో అలా చేయను. కథలో అంతర్భాగంగానే దాన్ని ఉండేట్టు చూస్తా. అదో చిన్న సెంటిమెంట్ అంతే' అంటున్నారు శ్రీను వైట్ల.
ప్రస్తుతం శ్రీను వైట్ల...మహేష్ తో ...ఆగడు చిత్రం చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ సొంతగా స్టోరీ రాయడం మొదలు పెట్టారు శ్రీను వైట్ల. 'ఆగుడు సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యుడొకరు మీడియాతో మాట్లాడుతూ దూకుడు తర్వాత శ్రీను వైట్ల మహేష్ బాబుతో ఆగడు సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఆయనే సొంతంగా స్టోరీ రెడీ చేసుకుంటున్నారు' అని తెలిపారు. దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications












