ఎన్టీఆర్ గుడ్డిగా నమ్మాడు అందుకే..
హైదరాబాద్: తారక్ యేడాదిపాటు.. నన్ను గుడ్డిగా నమ్మాడు. అతని కష్టం ఫలించింది అంటున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం 'బాద్ షా'. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్ నిర్మాత. 'బాద్ షా' విజయోత్సవం జరిగింది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే... ''ఈ విజయం సమష్టి కృషి. ఒక యేడాది పాటు కష్టమైనా ఎంతో ఇష్టపడి పనిచేశారు. నా మీద నా కంటే నిర్మాత గణేష్‌కే ఎక్కువ నమ్మకం ఉండేది. బడ్జెట్ గురించి ఎప్పుడూ ప్రస్తావన తీసుకురాలేదు'' అన్నారు. ఈ రోజు ఏ ఇద్దరు కలిసినా.. 'బాద్ షా' గురించే చర్చించుకొంటున్నారు. ఎన్టీఆర్ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఆదివారం కూడా సెట్‌కి వచ్చేవారు''అని చెప్పారు నిర్మాత.
ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ... ''దమ్ము తరవాత నాలుగు నెలలు ఖాళీగా ఉన్నా. ఆ విరామంలో శ్రీను వైట్ల నాకు ఆరు కథలు చెప్పాడు. ప్రతి కథా.. అదిరిపోయింది. ఆరు కథల్లో నచ్చిన ఒక్కో అంశం తీసుకొని 'బాద్ షా' రూపొందించారు. అందుకే.. ఇంత పెద్ద విజయం సాధించింది''అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన ఈచిత్రం విడుదలై అన్ని చోట్లా తొలి రోజు 100% ఆక్యుపెన్సీ సాధించాయి. సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో తొలి వీకెండ్ (శుక్ర, శని, ఆది) టికెట్లన్నీ ముందుగానే బుక్ అయ్యాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ పై నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











