శ్రీనువైట్ల బాలీవుడ్ ‘దూకుడు’కి బ్రేక్..జూ ఎన్టీర్ ప్రొజెక్ట్ షురూ...!

By Sindhu

'దూకుడు' సినిమా తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మొదట్లో 'దూకుడు' సినిమాను హిందీలో రిమేక్ చేస్తాడంటూ వార్తలొచ్చాయి. ఈ సినిమా చేయడానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపాడనీ, దాంతో తన బాలీవుడ్ ఎంట్రీని గ్రాండ్ గా చేసుకోవచ్చనీ శ్రీను వైట్ల ఆశపడ్డాడు. అయితే, సల్మాన్ డేట్స్ ఇప్పట్లో ఖాళీ లేనందున, ఈ ప్రాజక్ట్ ఆలస్యం అయ్యేలా వుంది.

దాంతో, తను ఇప్పటికే కమిట్ అయిన జూ ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయడానికే శ్రీను వైట్ల మొగ్గుచూపుతున్నాడు. త్వరలో షూటింగు ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని హాస్యనటుడు గణేష్ నిర్మిస్తున్నాడు. బృందావనం" చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించిన సమంత త్వరలో శ్రీనువైట్ల దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్‌ గా ఎంపికైందని సమాచారం.

జూ ఎన్టీఆర్, శ్రీనువైట్ల తొలి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రం కోసం ' మాఫియా... ఓ మంచి కుటుంబం" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంసమంతా ఇందులో కథానాయికగా నటించనుంది. గతంలో జూ ఎన్టీఆర్, సమంతా కలిసి 'బృందావనం'లో నటించిన సంగతి తెలిసిందే!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X