వెకిలి చేష్టలతో నవ్వురాదు: శ్రీనువైట్ల
"ప్రేక్షకులు నానుంచి కామెడీ కోరుకుంటారు. ఎన్నో ఏళ్ళ కృషి ఫలితంగానే ఆ బ్రాండ్ ఏర్పడింది...నేను ఎంత సీరియస్ విషయాన్నైనా ఎంటర్‌టైన్‌మెంట్ వే లోనే చెప్పడానికి ఇష్టపడతాను అంటూ చెప్పుకొచ్చారు శ్రీను వైట్ల. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 'వెకిలి చేష్టలతో నవ్వు రాదనేది నా నమ్మకం. కడుపుబ్బ నవ్వాలంటే అక్కడ సన్నివేశం బలంగా ఉండాలి. అలాగే సమకాలీన అంశాలతో జనాలు ఎప్పుడూ తొందరగా కనెక్ట్ అవుతారు. అందుకే నేను నా సినిమాల్లో వాటికి ప్రాధాన్యతనిస్తాను" అన్నారు.
కథ వినగానే మహేష్ 'ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్' అని అన్నారు. మహేష్‌ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా తెరమీద ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నప్పుడు నా కళ్ళ ముందు తెల్లటి చొక్కా, పులిగోరు చెయిన్‌తో మహేష్ ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు. దాన్నే దూకుడు సినిమాలో చూపించామన్నారు. దూకుడు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదన్నారు. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. గణేష్ నిర్మాత. 'దూకుడు'ను హిందీలో నేనే దర్శకత్వం చేస్తాను. అందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తాని చెప్పారు.


Click it and Unblock the Notifications











