'దూకుడు' ఘన విజయంపై శ్రీను వైట్ల స్పందన
"ఈ సినిమా విడుదలైన మరోసటి రోజు నా పుట్టినరోజు. అందువల్ల దీన్ని నా జన్మదిన కానుకగా భావిస్తున్నా. 'దూకుడు' ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం మహేశ్. అసాధారణ నటనతో ఈ విజయాన్ని సాధించాడు. అభిమానులు ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా అలాగా మహేశ్ ఇందులో కనిపించాడు. నిర్మాతలు కూడా బడ్జెట్‌కి వెనుకాడకుండా సినిమా ఇంత బాగా రావడానికి తోడ్పడ్డారు. సినిమాలోని అన్ని పాత్రలూ బాగా వర్కవుట్ అయ్యాయి. తమన్ ఇచ్చిన సంగీతం కూడా ప్లస్సయ్యింది. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గుహన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కథా రచయిత గోపీమోహన్, మాటల రచయిత కోన వెంకట్ తమ వంతు పాత్రలు బాగా చేశారు'' అని దర్సకుడు శ్రీను వైట్ల చెప్పారు.
ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా రూపొందిన దూకుడు గతవారం విడుదలై కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో శ్రీను వైట్ల పై విధంగా స్పందించారు. అలాగే ఈ సినిమా తొలి 3రోజుల్లో 21.22కోట్ల షేర్‌తో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. రిలీజ్ రోజే రూ.12 కోట్ల 56లక్షల గ్రాస్ (10కోట్ల 11లక్షల షేర్)తో గత రికార్డులన్నిటినీ.. అధిగమించింది. 80ఏళ్ల తెలుగు సినీచరిత్రలో ఇదో అరుదైన రికార్డ్ అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











