twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది 'బాద్‌షా'తో కుదిరింది: శ్రీను వైట్ల

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రతిభగల హీరో ఎన్టీఆర్‌. తనతో సినిమా చెయ్యాలనే కోరిక ఇప్పటిది కాదు. ఉషాకిరణ్‌ మూవీస్‌లో నేను ఆనందం చిత్రం చేశాను. ఆ సమయంలోనే తను కథానాయకుడిగా ఆ సంస్థ ద్వారా పరిచయం అయ్యారు. అప్పట్నించే ఎన్టీఆర్‌తో పరిచయం ఉంది. అన్నా అన్నా... అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. తనతో ఓ సినిమా తీయాలని అప్పట్లోనే నిర్ణయించుకొన్నా. అది 'బాద్‌షా'తో కుదిరింది. ఎన్టీఆర్‌ మంచి మనిషి. వ్యక్తిగతంగా తనలో భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఆయనతో మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తోంది అన్నారు శ్రీను వైట్ల.

    గతేడాది 'దూకుడు'తో ఘన విజయాన్ని అందుకొన్న శ్రీను వైట్ల ప్రస్తుతం ఎన్టీఆర్‌ని 'బాద్‌షా'గా చూపించే పనిలో ఉన్నారు. సోమవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే 'బాద్‌షా' ఎలా ఉండబోతున్నాడు అనే విషయం గురించి చెపుతూ... 'బాద్‌షా' అందరికీ నచ్చేలా ఉంటాడు. నా గత చిత్రాల్లాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే కథ ఇది. అయితే ఈసారి మాస్‌ అంశాలకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యమిచ్చాం. యాక్షన్‌ అంశాలు కూడా అధికస్థాయిలోనే ఉండబోతున్నాయి అన్నారు.

    'బాద్‌షా 'ఎన్టీఆర్‌ గెటప్స్‌, హావభావాల గురించి వినిపిస్తున్న రకరకాల వూహాగానాలు గురించి చెపుతూ... ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే విషయాలు 'బాద్‌షా'లో చాలానే ఉన్నాయి. వేషధారణ, నటన, హావభావాలు... ఇలా అన్ని అంశాల్లోనూ ఎన్టీఆర్‌ కొత్తగా కనిపిస్తాడు. ఆయనలో ఉన్న ప్రతిభను మొత్తం వాడుకొనే ప్రయత్నం చేశాను. ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ కథ రాసుకున్నాం అని చెప్పుకొచ్చారు.

    'బాద్‌షా ' లేటు గా మొదలవటానికి కారణం చెపుతూ.... స్క్రిప్ట్‌ విషయంలో పక్కాగా ఉంటాను. దానికి ఎక్కువ సమయం తీసుకొంటాను. మన కథ అందరినీ మెప్పించేలా ఉండాలనుకొన్నప్పుడు ఆ మాత్రం సమయం తీసుకోవడంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. 'బాద్‌షా' కథను మరింత పకడ్బందీగా తయారు చేసుకొనేందుకు సమయం పట్టింది. బండ్ల గణేష్‌ కూడా చిత్ర నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు అని వివరించారు.

    English summary
    Director Sreenu Vaitla is busy working on his stylish action-entertainer, Baadshah, starring Jr NTR and Kajal Aggarwal. The movie is currently being shot in Hyderabad. The teaser of the movie will be released today to coincide with the director's birthday. Vaitla is planning to celebrate his 40th birthday with friends, family and the Baadshah crew
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X