twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదే ఎన్టీఆర్ స్పెషాలిటీ: శ్రీను వైట్ల

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''ఎన్టీఆర్‌తో నాకిది తొలి చిత్రం. వయసులో నాకంటే చిన్నవాడైనా ఆయనో స్టార్‌ హీరో . కానీ ఎప్పుడూ ఆ హోదాని చూపించలేదు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. అన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. సింగిల్‌ షాట్‌లో డైలాగ్‌ చెప్పడం, స్టెప్‌ ఒక్కసారి చూస్తే చాలు రిహార్సల్‌ లేకుండా వేయడంలో ఆయనకు ఆయనే సాటి. జ్ఞాపకశక్తి ఆయనకో వరం. ఈ సినిమా టైటిల్‌ బాద్‌షా అని చెప్పగానే ఎన్టీఆర్‌ ఆ టైటిలే కావాలంటూ ప్రత్యేకంగా కోరారు.'' అని శ్రీను వైట్ల వివరించారు.

    శ్రీను వైట్ల తాజాగా ఎన్టీఆర్‌ని 'బాద్‌షా'గా చూపించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. శనివారం శ్రీను వైట్ల హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే ... ఎన్టీఆర్‌ జ్ఞాపకశక్తి అమోఘం...ఎంత పెద్ద డైలాగ్‌ అయినా ఇట్టే చెప్పేస్తాడు. క్లిష్టమైన డాన్సులు సైతం సింగిల్‌ టేక్‌లో చేసేస్తా డు. స్టార్‌డమ్‌ వచ్చేసినా చాలా సింపుల్‌గా ఉంటాడు. నన్ను అన్నా అని ఆప్యాయంగా పిలుస్తాడు. నా నిర్మాత గణేష్‌ ప్యాషన్‌ ఉన్న వ్యక్తి గనుకే ఇంత భారీ చిత్రాల్ని అలవోకగా తీయగలిగాడు. బ్లాక్‌బస్టర్‌ కోసం తపించి చేశాడీ చిత్రం అన్నారు.

    ఇక ''మహేష్‌బాబు ఈ చిత్రానికి నేపథ్య గళం అందించడం ఆనందంగా ఉంది. ఓ కథానాయకుడి చిత్రానికి మరో కథానాయకుడు వాయిస్‌ ఓవర్‌ చెబితే బాగుంటుందని భావించి అడిగితే వెంటనే ఆయన అంగీకరించారు. బాద్‌షాపై అభిమానుల్లో ఉన్న అంచనాలను అందుకోవాలనే ఎక్కువ ప్రత్యేకతలతో ఈ సినిమాని తీర్చిదిద్దాం. సిద్దార్థ్‌ ప్రత్యేక పాత్ర పోషించినా, నవదీప్‌ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించినా, శింబు పాట పాడినా ఇవన్నీ బాద్‌షాని ప్రత్యేకంగా ప్రేక్షకులకు అందించాలనే తపనతో చేసినవే.'' అన్నారు.

    English summary
    
 Director Srinu Vytlla says that he is very much happy to work with NTR. He also says NTR is very Simple person.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X