శ్రీను వైట్ల నెక్ట్స్ ఆ హీరోతోనే ఖరారు
దూకుడు జోరు మీద ఉన్న శ్రీను వైట్లకి ఆఫర్స్ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ఓకే చేసి ఆ కథ ను వండే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కి స్టోరీ లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ సంవత్సరాంతంలో అంటే డిసెంబతుర్ లో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వటానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక దూకుడులాగానే ఈ చిత్రం కూడా ఎంటర్టైన్మెంట్ తో సాగుతూ..కొత్త జెనర్ లో ఉండబోతుందని చెప్తున్నారు. బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దూకుడు సక్సెస్ గురించి మాట్లాడుతూ..." 'దూకుడు' ఇంత పెద్ద విజయం సాధించడానికి ప్రధాన కారణం మహేశ్. అసాధారణ నటనతో ఈ విజయాన్ని సాధించాడు. అభిమానులు ఎలా చూడాలనుకున్నారో సరిగ్గా అలాగా మహేశ్ ఇందులో కనిపించాడు. నిర్మాతలు కూడా బడ్జెట్‌కి వెనుకాడకుండా సినిమా ఇంత బాగా రావడానికి తోడ్పడ్డారు. సినిమాలోని అన్ని పాత్రలూ బాగా వర్కవుట్ అయ్యాయి. తమన్ ఇచ్చిన సంగీతం కూడా ప్లస్సయ్యింది.
రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గుహన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. కథా రచయిత గోపీమోహన్, మాటల రచయిత కోన వెంకట్ తమ వంతు పాత్రలు బాగా చేశారు'' అని దర్సకుడు శ్రీను వైట్ల చెప్పారు. ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో గా రూపొందిన దూకుడు గతవారం విడుదలై కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో శ్రీను వైట్ల పై విధంగా స్పందించారు. అలాగే ఈ సినిమా తొలి 3రోజుల్లో 21.22కోట్ల షేర్‌తో టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. రిలీజ్ రోజే రూ.12 కోట్ల 56లక్షల గ్రాస్ (10కోట్ల 11లక్షల షేర్)తో గత రికార్డులన్నిటినీ..అధిగమించింది. 80ఏళ్ల తెలుగు సినీచరిత్రలో ఇదో అరుదైన రికార్డ్ అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











