శ్రీను వైట్ల నెక్ట్స్ ఆ హీరోతో ఖరారు
ప్రస్తుతం పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడులో శ్రీనువైట్ల ఒకరు. అతనితో సినిమా చేయటానికి పెద్ద హీరోలందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రస్తుతం దూకుడులో బిజీగా ఉన్న శ్రీనువైట్ల తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. ఎన్టీఆర్ హీరోగా గణేష్ బాబు నిర్మించే చిత్రాన్ని శ్రీనువైట్ల డైరక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో గణేష్ ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం కోసం కూడా ఎన్టీఆర్ కీ, శ్రీను వైట్లకీ అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఓ ప్రక్క దూకుడు చిత్రం పూర్తి చేస్తూనే మరో ప్రక్క ఎన్టీఆర్ సినిమాకు స్క్ర్రిప్టు వర్క్ చేయిస్తున్నాడు. ప్రస్తుతానికి స్టోరీలైన్ చెప్పి ఎన్టీఆర్ చేత ఆమోద ముద్ర వేయించుకున్న శ్రీను వైట్ల పూర్తి స్క్ర్రిప్టుని త్వరలోనే వినిపిస్తానని, ఓ షేప్ కు స్క్ర్రిప్టు రాగానే చెప్తానని చెప్పి ఓకే చేయించుకున్నాడని చెప్తున్నారు. పూర్తి కామిడితో యాక్షన్ కలిపి సినిమా చేయటానికి ఎప్పటిలాగే శ్రీను వైట్ల రంగం రెడీ చేసుకుంటున్నారు. ఈ విషయమై రచయిత గోపీమోహన్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేష్ లో రూపొందే చిత్రం చాలా ఢిఫెరెంట్ గా రూపొందుతుందని ఆయన ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











