సూపర్ హిట్ 'ఢీ' చిత్రానికి సీక్వెల్ గా శ్రీను వైట్ల..
శ్రీను వైట్ల కెరీర్ ని కలిదిల్చి ముందుకు ఉరికించిన చిత్రం ఢీ. అలాగే ఆ తర్వాత విడుదలైన రెడీ చిత్రం కెరీర్ కు మంచి ఊపుని ఇచ్చింది. దాంతో ఇప్పుడు శ్రీను వైట్ల తన ఢీ చిత్రానికి సీక్వెల్ రెడీ చేసే ప్లాన్ లో పడినట్లు సమాచారం. దానికి ఢీ రెడీ అనే టైటిల్ ని పెట్టి ట్యాగ్ లైన్ గా .....బి రెడీ అని పెట్టనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఓ ప్రక్క మహేష్ తో చేస్తున్న దూకుడు షూటింగ్ బిజీలోనే ఈ చిత్రం సీక్వెల్ కు కొందరు రచయతలతో స్క్రిప్టు వండుతున్నాడని వినికిడి. అయితే ఈ సారి అవే పాత్రలు ఉన్నా బ్యాక్ డ్రాప్ మాత్రం మారి పోతుందని, బ్రహ్మానందం పాత్ర మాత్రం హైలెట్ గా ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క వరసగా సీక్వెల్ సినిమాలు ప్లాప్ కావటం కూడా శ్రీను వైట్లను సిక్వెల్ దిసగా నడవొద్దని కొందరు శ్రేయాభిలాషులు హెచ్చరిస్తున్నట్లు చెప్తున్నారు.
శ్రీను వైట్ల ఢీ రెడీ మంచు విష్ణు ఢీ రెడీ బీ రెడీ srinu vytla dhee ready manchu vishnu dookudu namo venkatesa


Click it and Unblock the Notifications