»   » శ్రీను వైట్ల-సల్మాన్ ఖాన్ సినిమా ఖరారు

శ్రీను వైట్ల-సల్మాన్ ఖాన్ సినిమా ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో సక్సెస్ సాధించిన పోకిరి, రెడీ లాంటి సినిమా కథలను..... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎగరేసుకెళ్లి హిందీలో వరుస హిట్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ పూపుతో తెలుగులో కొందరు దర్శకులు తీస్తున్న సినిమాలపై గట్టి నమ్మకం పెంచుకున్న సల్మాన్ మరో అడుగు ముందుకేశాడు. 'దూకుడు" సినిమా రిలీజ్ కాకముందే, దాని ఫలితం ఎలా ఉంటుందో..? తెలుసుకోక ముందే దాన్ని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

ఇటీవల శ్రీనువైట్ల ద్వారా 'దూకుడు" సినిమా కథను విన్న సల్మాన్ మారు మాట్లాడకుండా..... ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ పినిమా హీందీ వర్షన్ లో కూడా శ్రీను వైట్ల దర్శకత్వమే కావాలని ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ నాటికల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

English summary
The film ‘Dookudu’ is yet to release. But it is creating sensation. Srinu Vytla narrated the story of the film to Salman Khan and the star has agreed to do the same in Hindi without any second thought.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu