'దూకుడు' కాపీ మ్యాటర్ పై శ్రీను వైట్ల స్పందన
ఇన్‌స్పైర్ అవడం వేరు. కాపీ చేయడం వేరు. కాపీ చేసిన సినిమాల రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. ఎవరైనా ఎక్కడో అక్కడ ఇన్‌స్పైర్ కాక తప్పదు అన్నారు. దూకుడు చిత్రం గుడ్ బై లెనిన్ అనే జర్మని చిత్రం కాపీ అంటూ వచ్చిన క్రిటిసిజంపై శ్రీను వైట్ల ఇలా స్పందించారు. అలాగే దూకుడు చిత్రంలో మహేష్ చెప్పే 'అన్ బిలీవబుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్' అనే డైలాగు చాలా పాపులర్ అయ్యింది. ప్రోమోలలో కూడా దాన్నే వేస్తున్నారు. ఆ డైలాగు గురించి చెపుతూ శ్రీను వైట్ల...మహేశ్‌తో పూరీ చేసిన సినిమా (పోకిరి) చాలా సక్సెస్ అయింది. దాంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనిపించింది.
దూకుడుకు ముందు సినిమా తీద్దామని స్క్రిప్ట్ సిద్ధం అయ్యాక, ఆ కథ ఎందుకో మహేశ్ స్థాయికి సరిపోదని ఆపేశాను. కానీ, మూడు నెలల్లోనే బాగా డెవలప్ చేసి తీసుకెళ్లి చూపించాను. అది చూసిన మహేశ్ 'అన్ బిలీవబుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్' అన్నా రు. అదే డైలాగ్‌ను సినిమాలో కూడా వాడాం అన్నారు. అలాగే నాకు ఇండస్ట్రీలో హిట్ రావడానికి హోప్ మహేశ్‌తో ఉందని గుర్తించి, జాగ్రత్తగా సినిమా తీశాను. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడంలో మునిగిపోయా అన్నారు. ఓ టీవీ ఛానెల్ లో దూకుడు చిత్రం గురించి మాట్లాడుతూ శ్రీనువైట్ల ఇలా స్పందించారు.


Click it and Unblock the Notifications











