Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ నోటి దూల గురించి శ్రీను వైట్ల
చాలా మందికి నోటి దూల ఉంటుంది.మహేష్ కి ఆ లక్షణం పెడితే..కొంచెం తటపాయించినా, చివరకు అది బావుటుందనిపించింది.మహేష్ కూడా ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేసాడు అన్నారు శ్రీనువైట్ల. మహేష్ బాబు తాజా చిత్రం దూకుడులో మహేష్ క్యారెక్టర్ కి నోటి దూల ఉంటుంది. అది ప్రక్కనున్న క్యారెక్టర్ వెన్నెల కిషోర్ చేత కూడా చెప్పిస్తాడు. ఆ నోటి దురద తో మహేష్ తన ప్రేమించే అమ్మాయి సమంత దగ్గర ఇరుక్కుపోతాడు కూడా.ఈ సీన్స్ బాగా పండాయి. ఈ విషయాన్ని శ్రీనువైట్ల దగ్గర ప్రస్ధావిస్తే ఆయన ఇలా స్పందించారు. అలాగే నా ప్రతీ సినిమాల్లోనూ సినిమావాళ్లపై సెటైర్ పెడతాననేది ఓ అపోహ మాత్రమే.అయినా నేను తిరిగేది సినీ ప్రపంచంలో .నా కథకు ఇన్ పుట్స్ కూడా ఇక్కడ నుంచే వస్తాయి. అందుకే కొంత ఆ షేడ్స్ కనపడుతూంటాయి అన్నారు ఆయన.ఇక కథ విషయానికి వస్తే విలన్ ని బకరా చేసి ఆడుకోవటమేది ఢీతో ఓ ఫార్ములా అయిపోయింది.చాలామంది అదే దారిలో వెళ్తున్నారు. అందుకే నేను ఇంకో రహదారి అన్వేషణలో ఉన్నాను.నా నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో,గణేష్ బాబు నిర్మాత,ఇప్పుడు ఆ కథా చర్చల్లో ఉన్నాను అన్నారు.
ఇక దూకుడు విజయవంతంగా 50 వ రోజు వైపు దూసుకుపోతోంది. ఈ సందర్బంగా ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. విజయవాడ లో నవంబర్ 11 లేదా 12 తేదిల్లో ఈ పంక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు.మరో వారంలో ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజు మహేష్ పంక్షన్ కి రావాలి కాబట్టి ది బిజెనెస్ మ్యాన్ షెడ్యూల్ ని బట్టి డేట్ ఫిక్స్ అవుతుంది.ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు.అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక దూకుడు ఓ రేంజి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.. ప్రతీ రోజు మీడియాలో వీటికి సంభందించిన వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కొందరు కావాలని హైప్ క్రియోట్ చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు.అయితే మహేష్ తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ..ఇది అపీషయల్..దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్..అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఇక యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం అన్ని వర్గాలని ఆకట్టు కోవటంతో దాదాపు అందరూ మొదటి రెండు వారాల్లోనే ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు.