రామ్ చరణ్- శ్రీనువైట్ల సినిమా డీటేల్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం చిత్రం అక్టోబర్ నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వై.జయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగాల్సి ఉంది.
దూకుడు సినిమా భారీ విజయంతో మంచి జోరుమీద ఉన్న శ్రీను వైట్ల ప్రస్తుతం జూ ఎన్టీఆర్‌తో రూపొందించబోతున్న 'యాక్షన్' మూవీకి స్ర్కిప్టు తయారు చేసే విషయంలో బిజీగా ఉన్నాడు. దమ్ము చిత్రం షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్-శ్రీను వైట్ల సినిమా ప్రారంభం కానుంది. అనంతరం అక్టబర్లో రామ్ చరణ్ తో సినిమాపై దృష్టి పెట్టనున్నాడు శ్రీను వైట్ల.
ప్రస్తుతం రామ్ చరణ్ సంతప్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా అజ్మల్ అమీర్, ప్రకాష్ రాజ్, ముఖేష్ రుషి, బ్రహ్మానందం ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా...లీసా హౌడెన్ ఐటం సాంగులో మెరవనుంది.


Click it and Unblock the Notifications











