శ్రీను వైట్ల ఢీ హిందీ రీమేక్ డిటేల్స్
శ్రీను వైట్ల కామిడీ సినిమాలకు ఇప్పుడు హిందీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆయన సూపర్ హిట్ చిత్రం ఢీని కూడా హిందీలో రీమేక్ చేయాటనికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఇంద్రకుమార్ ఆ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారని సమాచారం. ఇంద్రకుమార్ గతంలో ఢమాల్, డబుల్ ఢమాల్, మస్తీ వంటి కామిడీ సినిమాలు రూపొందించారు. రైటర్ కోనవెంకట్ ఈ హిందీ వెర్షన్ కి స్క్రిప్టు రాయమని అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటిక్ రెడీ, పోకిరి చిత్రాలు హిందిలో రీమేక్ అయ్యాయి. అలాగే విక్రమార్కుడు, కిక్ చిత్రాలు రీమేక్ లు షూటింగ్ లో ఉన్నాయి. మర్యాదరామన్న రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక హిందీ డీ కోసం హిరో గా రితీష్ దేశముఖ్ ని అనుకుంటున్నారు. అతను ఇంద్రకుమార్ గత చిత్రాల్లో చేసి ఉన్నారు. అలాగే జెనీలియాను హీరోయిన్ గా కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











