Tollywood Movie: భయపడేవాళ్లు, గర్భిణీ స్త్రీలు మా సినిమా చూడొద్దు.. చిత్ర యూనిట్ హెచ్చరిక

ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే... మేకర్స్ తమ సినిమాను తప్పక చూడండి అంటూ ప్రచారం చేసుకుంటారు. అయితే ఓ మూవీ యూనిట్ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రచారం చేస్తుంది.. భయపడేవారు.. గర్భిణీ స్త్రీలు ఈ సినిమాను చూడొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. అది ఏ సినిమానో కాదు... శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన పిండం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే.. ప్రేక్షకులను భయపెట్టింది. ఇప్పుడు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఒకరికి ఒకరు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీరామ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం పిండం. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఈ సినిమా ట్యాగ్. కుశీ రవి ఈ సినిమాలో శ్రీరామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సాయి కిరణ్ దైదా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సాయికిరణ్ కు ఇదే డెబ్యూ మూవీ. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్, ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sriram Pindam Movie Unit Says Pregnant Women Should Not Watch The Movie Full Details Here

తాజాగా పిండం మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్లడిస్తూ ఓ ప్రత్యేక నోట్ ను కూడా షేర్ చేశారు. ఇక పిండం సినిమా గురించి చిత్ర బృందం చెప్తూ... ఈ సినిమాను గర్భిణీ స్త్రీలు చూడవద్దని సెన్సార్ బోర్డు హెచ్చ‌రిక జారీచేసిన‌ట్లు ప్రకటించారు.

ఇక పిండం సినిమాను డిసెంబ‌ర్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాన ఆరోజున ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. కళాహి మీడియా పతాకంపై యశ్వంత్‌ దగ్గుమాటి ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఇక సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి.

Sriram Pindam Movie Unit Says Pregnant Women Should Not Watch The Movie Full Details Here

శ్రీరామ్‌తో పాటు, ఈశ్వరీరావు, రవివర్మ, మాణిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ ఈషా, విజయలక్ష్మి, శ్రీలత త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఓ మారుమూల ప‌ల్లెటురిలో చాలా రోజులుగా ఎవరూ నివసించని ఒక‌ ఇంట్లోకి హీరో శ్రీరామ్ త‌న‌ కుటుంబంతో వచ్చి నివసిస్తూ ఉంటాడు. అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనంత‌రం వారికి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

ఇంట్లో ఉన్న‌ ఆత్మ.. శ్రీరామ్ కుటుంబానికి నిద్ర లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి మంత్రగత్తె ఈశ్వరీ రావు రాగా... ఆ తర్వాత ఆ ఇంట్లో ఏం జరిగింది.. ఆ ఆత్మల కథ ఏంటి వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనేది తెలియాలంటే సినిమా తెరపై చూడాలి. అయితే ఈ పిండం సినిమాను గర్భిణీ స్త్రీలు చూడొద్దని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X