బాలయ్య ‘శ్రీరామ రాజ్యం’ మళ్లీ వాయిదా
టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీరామ రాజ్యం సినిమా మళ్లీ వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఆగస్టు 15నే సినిమా ఆడియో విడుదల చేశారు. వాస్తవానికి ఈ సినిమా విజయ దశమి కానుకగా విడుదల చేయాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల అప్పుడు సినిమా వాయిదా వేశారు. మళ్లీ దీపావళి కానుకగా అక్టోబర్ 26న విడుదల చేయాలని భావించారు. కానీ ఈ సారి కూడా సినిమా వాయిదా పడింది. నవంబర్ 17 లేదా 24న విడుదల చేసే అవకాశం ఉందని సినిమా యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ వాయిదాతో బాలయ్య అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారని చెప్పక తప్పదు.
బాపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తిగా పౌరాణిక నేపథ్యం ఉంటుందని అంటున్నారు. రాముడి పాత్రలో బాలయ్య, నయనతార సీత పాత్రలో నటించింది. యలమంచిలి సాయిబాబు ఈ చిత్రానికి నిర్మాత. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాక పోవడం వల్లనే సినిమా విడుదల ఆలస్యం అవుతోందని ఫిల్మ్ నగర్ టాక్.


Click it and Unblock the Notifications











