నయనతారను ఓదార్చిన బాలకృష్ణ
బాలకృష్ణ, నయనతార రీసెంట్ గా సింహా, ఆ తర్వాత రామరాజ్యం చిత్రాలు చేసారు.వీరిద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఇక శ్రీరామరాజ్యం చిత్ర షూటింగ్ కోసం ముంబయి నుంచి హైదరాబాద్ వచ్చిన నయనతార మంగళవారంతో ఆ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. అనంతరం యూనిట్ సభ్యులందరినీ కలుసుకుని నమస్కరిస్తూ బాధగా సెలవు తీసుకుంది. ఆ సందర్బంగా ఆమె ఇక సెలవు అంటూ గద్గద స్వరంతో నమస్కరిస్తూ కంటతడి పెట్టింది. ఎందుకంటే ఆమె ఆ చిత్రం అనంతంర ఇక సినిమాలు చేయనని నిర్ణయం తీసుకుంది.
దాంతో ఆ రోజునే లాస్ట్ డే గా ఫీలైంది. కారణం వివాహనంతరం సినిమాల్లో నటించకూడదని నయనతారకు ప్రభుదేవా కండిషన్ పెట్టారు. అందుకు ఆమె కూడా సమ్మతించింది. అప్పుడు బాలకృష్ణ నయనతారను ఓదార్చుతూ వివాహానంతరం మళ్లీ నటించవచ్చని చెప్పగా ప్రభుదేవా నిబంధన గురించి నయనతార చెప్పినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభుదేవా, నయతార ముంబయిలో ఉంటున్నారు. వీరి వివాహం కూడా ముంబయిలోనే జరిగే అవకాశం ఉంది. శ్రీరామ రాజ్యంలో బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











