సాంగ్ బావుంది: కొడుకుపై అల్లు అరవింద్ ఖర్చు కనిపిస్తోంది.. (వీడియో)
హైదరాబాద్: గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన చిన్న కుమారుడు అల్లు శిరీష్‌ని హీరోగా నిలబెట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సినిమా తీస్తే నిర్మాణ విలువలు ఏలా ఉంటాయో తన మార్క్ చూపిస్తున్నాడు.
ఇప్పటికే రెండు సినిమాలు చేసినా శిరీష్ అనుకున్న స్థాయికి రాలేక పోయాడు. లుక్ పరంగానే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా వీక్ ఉండటమే అతనిలోని ప్రధాన లోపం. చాలా కష్టపడి గత రెండేళ్లుగా శిరీష్ ముఖ్యంగా ఈ రెండు అంశాల మీదనే ఫోకస్ పెట్టాడు. చాలా కష్టపడి, ఎక్స్‌పర్ట్స్ సమక్ష్యంలో శిక్షణ తీసుకుని గతంలో కంటే బెటర్ లుక్‌లోకి మారాడు.
ప్రస్తుతం శిరీష్ దర్శకుడు పరుశురామ్(బుజ్జి) దర్శకత్వంలో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి అల్లు శిరీష్ సరసన కథానాయికగా నటించింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. స్లో బీట్ తో సాగే డ్యుయెట్ ఇది.
పాటలోని సాహిత్యంతో పాటు చిత్రీకరణ ఆకట్టుకునే విధంగా ఉంది. తానే నిర్మాత కాబట్టి అల్లు అరవింద్ కొడుకు పై ఖర్చు బాగానే పెట్టినట్లు ఈ సాంగ్ చూస్తే స్పష్టమవుతోంది. ఖర్చు విషయంలో కాంప్రమైజ్ కాకుండా లేదనే విషయం విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది.
ఇక శిరీష్ తన లుక్ మార్చుకోవడానికి పడ్డ కష్టం ఈ సాంగులో కనిపిస్తోంది. గతంలో కంటే బెటర్ లుక్ తో శిరీష్ ఆకట్టుకుంటున్నాడు. అలాగే బాడీ లాంగ్వేజ్ లో కూడా చాలా మార్పు వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందం కూడా సినిమా ప్లస్. ఈ సాంగ్ చూస్తేంటే 'శ్రీరస్తు.. శుభమస్తు'సినిమాతో శిరీష్ స్టాండయ్యే అవకాశం కనిపిస్తోంది. బెస్టాఫ్ లక్ శిరీష్.


Click it and Unblock the Notifications












