తీవ్రమవుతున్న బాబు గోగినేని కేసు.. బిగ్ బాస్ నుంచి అవుటేనా, శ్రీరెడ్డి కామెంట్స్!

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Complaint Filed Against Babu Gogineni

హేతువాది బాబు గోగినేని టివి చర్చ కార్యక్రమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ 2 షోకు బాబు గోగినేని కూడా కంటెస్టెంట్ గా ఎంపిక అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తో బాబుగోగినేని హ్యుమానిస్ట్ గా మాత్రమే కాక సెలేబ్రిటిగా కూడా మారిపోయారు. జ్యోతిష్యాలు, మూఢనమ్మకాలు, ఇతర సామజిక అంశాలపై ఆయన ఎక్కువగా టివి డిబేట్లలో పాల్గొన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాలలో కూడా ఆయన ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. తాజగా ఆయనపై వీరనారాయణ అనే వ్యక్తి నమోదు చేసిన కేసు తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిందూ గ్రంధాలపై వ్యతిరేకంగా

హిందూ గ్రంధాలపై వ్యతిరేకంగా

ఇటీవల బాబు గోగినేని హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసారని, గోప్యంగా ఉంచాల్సిన ఆధార్ నంబర్స్ ని అక్రమంగా తరలించారనే ఆరోపణలతో వీర నారాయణ అనే వ్యక్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు.

బెంగుళూరులో

బెంగుళూరులో

బెంగుళూరులో జరిగిన ఓ సమావేశంలో హిందూ గ్రంధాలని అవమానించేలా మాట్లాడారని, నిబంధలని అతిక్రమించి ఆధార్ నెంబర్ సేకరించారని వీరనారాయణ కేసు నమోదు చేసారు. కోర్టు నుంచి తీసుకొచ్చిన పత్రం ఆధారంగా బాబు గోగినేనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించి అతడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

 బిగ్ బాస్ నుంచి బయటకు

బిగ్ బాస్ నుంచి బయటకు


కేసు తీవ్రంగా మారి పోలీసులు చర్యలు తీసుకునే నేపథ్యంలో బాబు గోగినేని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 ఎప్పుడు బయటకు వస్తున్నారు

ఎప్పుడు బయటకు వస్తున్నారు

బాబు గోగినేని బిగ్ బాస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తున్నారు.. మీ కోసం పోలీస్ లు ఎదురుచూస్తున్నారు అంటూ శ్రీరెడ్డి వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X