For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రకుల్ ప్రీత్‌కి శ్రీరెడ్డి కౌంటర్.. ఆమెని చూసి నేర్చుకో అంటూ ఘాటుగా!

    |
    Sri Reddy Comments On Rakul Preet Singh

    మీడియా సంచలనం శ్రీరెడ్డి తరచుగా తన నోటికి పని చెబుతూనే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. టాలీవుడ్, కోలీవుడ్ ఇలా తేడా లేకుండా సినీప్రముఖులపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి గురించి ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో చర్చ జరుగుతూనే ఉంది. తాజగా మరోమారు శ్రీరెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

    చూసి నేర్చుకో

    చూసి నేర్చుకో

    సాటి నటీమణుల గురించి ఎలా మాట్లాడాలో తమిళ నటి ఆండ్రియాని చూసి రకుల్ ప్రీత్ సింగ్ నేర్చుకోవాలని శ్రీరెడ్డి ఫైర్ అయింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆండ్రియా శ్రీరెడ్డిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశంసించిన సంగతి తెలిసిందే.

    మద్దత్తుగా

    మద్దత్తుగా

    విశ్వరూపం2 చిత్రం విడుదలకు ముందు ఆండ్రియా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రీరెడ్డి పై కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి చాలా ధైర్యంతో అన్ని విషయాలని బయటపెడుతోందని తెలిపింది. అందులో వాస్తవం ఉంటె నిందితులని శిక్షించాల్సిందే అని తెలిపింది.

    రకుల్ ప్రీత్

    రకుల్ ప్రీత్

    కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి టాలీవుడ్ ప్రముఖుల్ని ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి ఆరోపిస్తున్నట్లు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని రకుల్ ప్రీత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. శ్రీరెడ్డి తీరుని తప్పుబట్టింది.

    తీవ్ర విమర్శలు

    తీవ్ర విమర్శలు

    ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై ఆండ్రియా స్పందనని తెలియజేస్తూ రకుల్ ప్రీత్ పై విరుచుకుపడింది. క్రమంగా సినీప్రముఖులు కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలని పట్టించుకోవడం మానేశారు.

    English summary
    SriReddy comments on Rakul Preet singh. Rakul Preet should learn from andrea jeremiah says SriReddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X