కౌశల్‌ని తొక్కేసే ప్రయత్నం.. నానిపై భగ్గుమన్న శ్రీరెడ్డి!
Recommended Video

శ్రీరెడ్డి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. కాస్టింగ్ కౌచ్ పేరుతో మీడియాలో పబ్లిసిటి పొందిన శ్రీరెడ్డి.. ఇప్పటికి అసభ్యకర పదజాలం మానడం లేదు. కానీ ఆమె వ్యాఖ్యలని అందరూ పట్టించుకోవడం మానేశారు. తాజాగా శ్రీరెడ్డి బిగ్ బాస్ షో పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో కాస్త చర్చనీయాంశంగా మారింది. కౌశల్ కు మద్దత్తు తెలుపుతూ షో హోస్ట్ అయిన నానిపై మండి పడింది.

కౌశల్‌ని తొక్కేసే ప్రయత్నం
100 రోజులకు పైగా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో ఆదివారంతో ముగియబోతోంది. ఐదుగురు ఇంటి సభ్యులు కౌశల్, తనీష్, సామ్రాట్, గీత , గీప్తి ఫైనల్స్ కు చేరుకున్నారు. విజేతగా ఎవరు నిలుస్తారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో శ్రీరెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందంటూ శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టింది.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

నానిపై అసభ్యంగా
బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని అసభ్య పదజాలంతో దూషిస్తూ శ్రీరెడ్డి కామెంట్స్ పెట్టింది. షో ఆరంభంలో కూడా శ్రీరెడ్డి నానిపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో కౌశల్ కు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందంటూ నానిపై భగ్గుమంది.

నూతన్ నాయుడు కూడా
బిగ్ బాస్ చివరి దశకు చేరుకోవడంతో ఎలిమినేట్ అయిన సభ్యులంతా సరదాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ నూతన్ నాయుడు మాత్రం వెళ్ళలేదు. తనకు అత్యధిక ఓట్లు వచ్చినా కూడా కావాలనే ఎలిమినేట్ చేశారని నూతన్ నాయుడు మండిపడుతున్నాడు.

అద్భుతం జరుగుతుందా
ఇదిలా ఉండగా రేపు జరగబోయే ఎపిసోడ్ గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఆడియన్స్ స్పందన దృష్ట్యా కౌశల్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గీత మాధురి కౌశల్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. అద్భుతం జరిగితే గీత మాధురికి కూడా విజయావకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











