పవన్, చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్.. మీ అన్న ఎంత మందిని తొక్కాడో మాకు తెలియదా!

Recommended Video

Sri Reddy Severe Comments On Chiranjeevi

శ్రీరెడ్డి తన వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగిస్తోంది. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న శ్రీరెడ్డి తాజగా పెను దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది. కాస్టింగ్ కౌచ్ విషయంలో చట్టాలని, న్యాయస్థానాలని ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ సూచిన ఇచ్చినప్పటి నుంచి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లినే దూషిస్తూ చేసిన దారుణమైన వ్యాఖ్యలు, దానిపై కొన్ని మీడియా సంస్థలు నడిపిన డిబేట్లు అందరూ గమనించారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ దాడితో ఆయా మీడియా ఛానల్స్ సైలెంట్ అయిపోయాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతున్న నేపథ్యంలో శ్రీరెడ్డి మరో మారు సంచలన వ్యాఖ్యలు చేసింది.

పవన్, చిరంజీవిపై వ్యాఖ్యలు

పవన్, చిరంజీవిపై వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిపై శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. చిరు గత రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చేరిన పోస్ట్ లో ఎక్కువగా రాజకీయ అంశాలు ప్రస్తావించింది.

సింగిల్ పైసా ఖర్చు చేయలేదు

మీ అన్న తిరుపతి నుంచి ఎన్నికయ్యాడు. కేవలం ఒక్కసారి మాత్రమే తిరుపతికి వచ్చాడు. తిరుపతి ప్రజల కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు అని ఇక్కడ వారు అనుకుంటున్నట్లు శ్రీరెడ్డి తెలిపింది. తిరుపతిలో జరిగిన అభివృద్ధి మొత్తం చంద్రబాబు చేసినదే అని శ్రీరెడ్డి తెలిపింది.

ఎంత మందిని తొక్కాడు

సినిమాల్లో మీ అన్న ఎంతమందిని అణగదొక్కాడో మాకు తెలియదా అంటూ శ్రీరెడ్డి చిరుని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ వలెనే

పవన్ కళ్యాణ్ వలెనే

పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతోనే మా అసోసియేషన్ వారు తనకు సభ్యత్వం ఇవ్వడం లేదని శ్రీరెడ్డి ఆరోపించింది. సినిమా డైలాగులు కొట్టి మంచి నీళ్లు తాగినంత సులభం కాదు రాజకీయాలు అంటూ శ్రీరెడ్డి సెటైర్ వేసింది.

ఆ వివరాలు రహస్యంగా

ఆ వివరాలు రహస్యంగా

ఇలా శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేస్తుంటే.. మరో వైపు ఆమె గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోంది. కానీ ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వివరాలు గోప్యంగా ఉంచారు.

శ్రీరెడ్డి కూడా ఉందా

శ్రీరెడ్డి కూడా ఉందా

శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నానికి నాకు పడదు, మరి ఎలా అంటూ ఆమె చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. ఆడియన్స్ ని ఆశ్చర్యంలో ముంచెత్తేందుకే వివరాలు గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X