ఎఫ్2 మూవీపై శ్రీరెడ్డి వల్గర్‌గా.. వెంకీ మామ 90 డిగ్రీస్ వాడారంటగా!
విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత ఎఫ్2 చిత్రంలో చెలరేగి నటించారు. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి తరహాలో వెంకీ ఎఫ్2 చిత్రంలో కామెడీ పండించారు. ఎఫ్2 చిత్రం కళ్ళు చెదిరే వసూళ్లతో భారీ విజయంగా నిలిచింది. ఈ ఏడాది టాలీవుడ్ తొలి బ్లాక్ బస్టర్ ఎఫ్2 మూవీనే. అనిల్ రావిపూడి తనదైన శైలి మరో కమర్షియల్ స్టోరీతో మ్యాజిక్ చేశారు. వరుణ్ తేజ్ నటనకు కూడా ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.

వల్గర్ కామెంట్స్
శ్రీరెడ్డి తరచుగా సోషల్ మీడియాలో అసభ్యమైన కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదాన్ని తీసుకుని శ్రీరెడ్డి తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ పోరాటం పేరుతో శ్రీరెడ్డి చాలా రోజులపాటు జాతీయ మీడియా స్థాయిలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రం ఘనవిజయం సాధించడంతో శ్రీరెడ్డి ఆ చిత్రంపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది.
కంగ్రాట్స్ మామ
చినమామ అదే మా వెంకీ మామ ఎఫ్2 మూవీ పెద్ద హిట్ అంటగా. కంగ్రాట్స్ మామ. ఈ చిత్రంలో నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా అంటూ శ్రీరెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి వివాదాల్లో తలదూర్చని వెంకటేష్ ను ఉద్దేశిస్తూ శ్రీరెడీ ఈ వ్యాఖ్యలు చేయడంతో, ఫ్యాన్స్ కూడా అదేస్థాయిలో శ్రీరెడ్డికి కౌంటర్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అనే హ్యాష్ టాగ్ కూడా జత చేసింది.

దగ్గుబాటి ఫ్యామిలీతో
కాస్టింగ్ కౌచ్ పోరాటం సందర్భంగా శ్రీరెడ్డి నానా రభస చేసిన సంగతి తెలిసిందే. సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో ఉన్న సన్నిహిత ఫోటోలని శ్రీరెడ్డి లీక్ చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి తమిళ చిత్రాల కోసం చెన్నైలో మకాం వేసింది.

పలు చిత్రాల్లో అవకాశాలు
కాస్టింగ్ కౌచ్ పోరాటంతో శ్రీరెడ్డికి మీడియాలో బాగా పబ్లిసిటీ లభించింది. శ్రీరెడ్డికి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు తమిళ దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. శ్రీరెడ్డి ప్రస్తుతం తానే ప్రధాన పాత్రలో నటిస్తూ ఓ చిత్రం చేస్తోంది. దర్శకుడు రాఘవలారెన్స్ కూడా తనకు అవకాశాలు ఇచ్చాడని శ్రీరెడ్డి ఆ మధ్యన ప్రకటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











