twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి ఘోరమైన తప్పు.. భగ్గుమంటున్న ప్రజాసంఘాలు!

    |

    Recommended Video

    Sri Reddy Did Big Mistake On Tollywood Issue

    కాస్టింగ్ కౌచ్ పై పోరాటం, ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న నిరసనతో ఒక్కసారిగా శ్రీరెడ్డి జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం విషయంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా శ్రీరెడ్డికి మద్దత్తు తెలిపాయి. ఆ తరువాత శ్రీరెడ్డికి మీడియాలో పబ్లిసిటి బాగా పెరింది. కానీ ఇటీవల శ్రీరెడ్డి విచక్షణ కోల్పోతుందనే వాదన ఎక్కువవుతోంది. తాజాగా చికాగో సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి చేసిన ఘోరమైన తప్పిదం ఆమెని తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.

    మీడియాలో బాగా పబ్లిసిటీ

    మీడియాలో బాగా పబ్లిసిటీ

    శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న సమయంలో కొన్ని మీడియా సంస్థలు కూడా శ్రీరెడ్డికి పరిమితికి మించిన పబ్లిసిటి కల్పించాయి. ఆ సంస్థలు ఎందుకు అలా చేసాయి అనేది వేరే చర్చ. కానీ ఆ పబ్లిసిటీతో శ్రీరెడ్డి విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి.

    ప్రజాసంఘాల మద్దత్తు

    ప్రజాసంఘాల మద్దత్తు

    కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తోంది అనే ఉద్దేశంతో ప్రజాసంఘాలు, మహిళా సంఘ నాయకురాళ్లు శ్రీరెడ్డికి మద్దతుగా నిలిచాయి. తాజాగా చికాగో సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి ప్రవర్తన మద్దత్తు ఇచ్చిన వారికే షాక్ ఇచ్చే విధంగా ఉంది.

    టాలీవుడ్ సెక్స్ రాకెట్

    టాలీవుడ్ సెక్స్ రాకెట్

    ఇటీవల అమెరికాలో బట్టబయలైన టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఉదంతం చిత్ర పరిశ్రమకు షాక్ ఇచ్చే విధంగా ఉంది. కిషన్ ముడుగుముడి దంపతులని అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. యుఎస్ పోలీసులు ఈ కేసుకు సంబందించిన వివరాలని తెలిపారే తప్పా మరే టాలీవుడ్ సెలెబ్రిటీ పేరు బయట పెట్టలేదు.

    మహిళలకు సంబంధించిన అంశం

    మహిళలకు సంబంధించిన అంశం

    చికాగో సెక్స్ రాకెట్ లో కొందరు డబ్బు కోసం చేసినవారు ఉన్నా, మరికొందరు కిషన్ దంపతుల ట్రాప్ లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. మహిళలకు సంబందించిన విషయం కావడంతో ఎవరి పేరు బయటకు రాకుండా యుఎస్ పోలీసులు జాగ్రత్తగా ఈ కేసుని డీల్ చేస్తున్నారు.

    శ్రీరెడ్డి మరో ఘోర తప్పిదం

    శ్రీరెడ్డి మరో ఘోర తప్పిదం

    కాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి ఇప్పటికే పలువురు ప్రముఖులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. చికాగో సెక్స్ రాకెట్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి ఇటీవల తన సోషల్ మీడియాలో దాదాపు 30 మందికి పైగా టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ చర్య చాలా ఘోరమైన తప్పిదం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    ఆధారాలు లేకుండా

    ఆధారాలు లేకుండా

    ఇంటివంటి ఆధారాలు లేకుండా, కనీసం సాటి మహిళలే అనే భావన లేకుండా శ్రీరెడ్డి పేర్లు సోషల్ మీడియాలో రాయడం హేయమైన చర్య అని అంటున్నారు. ఏకంగా కొందరి ఫోటోలు కూడా షేర్ చేసింది. దీనిపై సర్వత్రా తీవ్రమైన విమర్శలు చెలరేగుతున్నాయి.

    చాలా ఆరోపణలు

    చాలా ఆరోపణలు

    శ్రీరెడ్డి కొన్ని నెలల క్రితం చాలా మంది ప్రముఖులపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆధారాలు ఉంటె లీగల్ చర్యలు తీసుకోవాలి. కానీ శ్రీరెడ్డి ఆదిశగా ప్రయత్నం కూడా చేయలేదు. మీడియాలో, సోషల్ మీడియాలో అర్థం లేని ఆరోపణలు మాత్రమే చేస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    తీవ్రంగా ఖండించిన సంధ్య

    తీవ్రంగా ఖండించిన సంధ్య

    ప్రజాకార్యకర్త సంధ్య శ్రీరెడ్డి చర్యని తీవ్రంగా ఖండించారు. శ్రీరెడ్డి చేసింది చాలా పెద్ద తప్పు. భాదితుల వివరాలు పేర్కొనవద్దని తాము చాలా రోజులుగా మీడియాని కోరుతున్నాము. కానీ శ్రీరెడ్డి మాత్రం ఫొటోలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అని సంధ్య మండిపడ్డారు.

    పవన్ కళ్యాణ్ విషయంలో కూడా

    పవన్ కళ్యాణ్ విషయంలో కూడా

    పవన్ కళ్యాణ్ తల్లిని పబ్లిక్ గా, మీడియా ఎదుట శ్రీరెడ్డి దారుణంగా దూషించిన సంగతి తెలిసిందే. ఈ హేయమైన చర్యని కొన్ని మీడియా సంస్థలు బాగా హైలైట్ చేసాయి. ఆ సమయంలో కూడా తాము శ్రీరెడ్డిని వారించామని, ఇలాంటి దారుణమైన మాటలు, భాధ్యతలేని విధంగా మాట్లాడవద్దని సూచించాం. కానీ ఆమె మా మాటలు వినిపించుకోలేదని సంధ్య అన్నారు.

    శ్రీరెడ్డికి సపోర్ట్ ఇవ్వం

    శ్రీరెడ్డికి సపోర్ట్ ఇవ్వం

    శ్రీరెడ్డి నుంచి ఇలాంటి చర్యలు ఊహించలేదని మరో ప్రజాకార్యకర్త సుజయ అన్నారు. పేర్లు బయట పెట్టడం, అవమానపరిచే చర్యలకు తాము వ్యతిరేకం అని ఆమె అన్నారు. ప్రస్తుతం తమకు శ్రీరెడ్డికి సపోర్ట్ చేసే ఉద్దేశం లేదని తేల్చారు.

    English summary
    Srireddy did big mistake on Tollywood sex racket. She post over 30 film celebrity name in FB
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X