నీవు ఆడదానివేనా? లైవ్‌లో శ్రీరెడ్డి గొంతు పిసికిన సినీ నటి.. శ్రీరెడ్డి టార్గెట్ నేచురల్ హీరో..

By Rajababu

Recommended Video

Sree Reddy Another Post In Facebook

సినిమా పరిశ్రమ, ఇండస్ట్రీ పెద్దలపై నటి శ్రీరెడ్డి ఫైర్ అయింది. సినీ పెద్దల తీరు వల్ల తెలుగు అమ్మాయిలు బలైపోతున్నారని ఆమె మండిపడింది. బుధవారం రాత్రి ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికలో వర్ధమాన దర్శకుడు పవన్ కల్యాణ్, సినీ నటి కల్యాణితో కలిసి శ్రీరెడ్డి పాల్గొన్నారు. అన్యాయానికి గురైన తన వద్ద ఆధారాలు ఉన్నాయి. వాటి ఆధారంగానే పెద్దలను నిలదీస్తుంటే సినీ నటులు ఎవరూ మద్దతు తెలపడం లేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గుర్తింపు కార్డు ఎందుకు ఇవ్వరు అని ఆమె ప్రశ్నించింది. అలాగే నేచురల్ అంటూ ఓ హీరోపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కల్యాణి

శ్రీరెడ్డి వ్యాఖ్యలపై కల్యాణి

శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై నటి కల్యాణి స్పందించింది. ఇలా చవకబారు రీతిలో శ్రీరెడ్డి వ్యవహరిస్తే పరిశ్రమ పెద్దలు, నటీనటులు ముందుకు రారు అని అన్నారు. శ్రీరెడ్డికి అండగా నిలువాలి అని తాను కొందరిని కోరగా.. సినీ పరిశ్రమను బజారుకు ఈడిస్తే ఎవరు మద్దతిస్తారని నన్ను కొందరు నిలదీశారు అని కల్యాణి చెప్పింది.

 నీవు ఆడదానివేనా?

నీవు ఆడదానివేనా?

ఓ దశలో నాకు అన్యాయం జరుగకపోతే ఫిలింనగర్‌లో బట్టలూడదీసుకొని నిలబడుతానని వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై కల్యాణి మండిపడింది. మీడియాలో ఇలా నోరు పారేసుకొంటున్న నీవు ఆడదానివేనా అని కల్యాణి నిలదీసింది.

శ్రీరెడ్డి చంపేస్తా

శ్రీరెడ్డి చంపేస్తా

సినీ నటులను ప్రతిష్ఠను దిగజారే విధంగా మాట్లాడితే చంపేస్తా. అడ్డదిట్టంగా మాట్లాడి ఆడవాళ్ల పరువును బజారుకు ఈడుస్తావా అని కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డదిట్టంగా మాట్లాడితే చంపేస్తాను అని శ్రీరెడ్డి గొంతును కల్యాణ్ నులుమబోయింది.

 శ్రీరెడ్డికి అండగా నిలుస్తాను

శ్రీరెడ్డికి అండగా నిలుస్తాను

శ్రీరెడ్డి, కల్యాణి మధ్య టెలివిజన్ లైవ్‌లోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత శాంతించిన కల్యాణి.. శ్రీరెడ్డి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకనే శ్రీరెడ్డి నోరుజారుతున్నారని కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

 టాలీవుడ్‌ హీరోపై శ్రీరెడ్డి ఆరోపణలు

టాలీవుడ్‌ హీరోపై శ్రీరెడ్డి ఆరోపణలు

ఇదిలా ఉండగా, శ్రీరెడ్డి మరోసారి ఫేస్‌బుక్‌లో ఓ హీరోను టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. నీవు నిజ జీవితంలో కూడా బాగా నటిస్తావు. ఆన్ స్క్రీన్‌పై నీవు నేచురల్. నీవు నేచురల్‌గా కనిపిస్తావు. దానిని నీకు ఒక మాస్క్ మాదిరిగా ఉపయోగించుకొంటున్నావు అని శ్రీరెడ్డి గురువారం ఓ పోస్ట్ పెట్టారు.

రాంచరణ్‌ను చూసి నేర్చుకో

రాంచరణ్‌ను చూసి నేర్చుకో

కెరీర్ ఆరంభంలో బాగా కష్టపడ్డానని చెప్పుకొంటావు. అలా చెప్పుకొని ప్రజలను ఎమోషనల్‌గా అత్యాచారం చేస్తున్నావు. ప్రేక్షకులు, ప్రజల ముందు నీవు ఆడే డ్రామా చాలా సూపర్‌గా ఉంటుంది. నీ ముందు పెద్ద హీరోలు మంచివారిగా కనిపిస్తారు. రాంచరణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ చూసి నేర్చుకొండి అని తన పోస్టులో శ్రీరెడ్డి పేర్కొన్నారు.

యాటిట్యూట్ ఎక్కువే నీకు

యాటిట్యూట్ ఎక్కువే నీకు

ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు ఎలాంటి ఇగోలు లేవు. కానీ నీకు మాత్రం యాటిట్యూట్ ఎక్కువే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న డైరెక్టర్లంటే నీకు చిన్నచూపు. నీవు సక్సెస్ అయ్యాక నీ ప్రవర్తన చెడుగా మారింది.

 ఎందరో అమ్మాయిలను వాడుకొన్నావ్

ఎందరో అమ్మాయిలను వాడుకొన్నావ్

ఇటీవల నీకు ఓ కొడుకు పుట్టాడు. అందుకు నీకు కంగ్రాట్యులేషన్స్. జీవితంలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకో. ఎందుకంటే నీవు ఎందరో అమ్మాయిలను బాగా వాడుకొన్నావు. ఇప్పుడు వారంతా చావలేక బతుకుతున్నారు అని శ్రీరెడ్డి తన పోస్టులో పేర్కొన్నది.

 ఎప్పటికైనా దేవుడు శిక్షిస్తాడు

ఎప్పటికైనా దేవుడు శిక్షిస్తాడు

దేవుడు ఎప్పటికైనా న్యాయం చేస్తాడనే మాట గుర్తుంచుకో. శిక్షించడానికి కొంత సమయం పట్టవచ్చునేమో గానీ దేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాడు. ఏదో రోజు నీవు జీవితంలో శిక్షింపబడుతావు. ఇండస్ట్రీ ఎదో ఒకరోజు తొక్కేస్తుంది. నీలాంటి ఈక ఇండస్ట్రీ నుంచి రాలిపోవడం ఖాయం అని శ్రీరెడ్డి తన పోస్టులో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X