శ్రీరెడ్డి లీక్స్.. సోషల్ మీడియాలో ఫోటోలు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు.. సినీ ప్రముఖుల్లో కలవరం..

By Rajababu

Recommended Video

Sree Reddy Started Leaks On Social Media About Tollywood Culture

న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీరెడ్డి మల్లిడి మోడల్‌గా, సినీతారగా అంచెలంచెలుగా ఎదిగారు. పలు చిత్రాల్లో హీరోయిన్‌స్ఠాయి పాత్రలతోపాటు, హాట్‌హాట్‌గా కనిపించింది. చాలా రోజులుగా కనుమరుగైపోయిందనుకొన్న శ్రీరెడ్డి మీడియా‌లో సంచలనంగా మారింది. తెలుగు హీరోయిన్లకు గుర్తింపు లభించడం లేదని, వేషాల ఇస్తామని చెప్పి తనను శారీరకంగా వాడుకొన్నారంటూ సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేయడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.

ఇంటర్వ్యూల కోసం పోటీ

ఇంటర్వ్యూల కోసం పోటీ

ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూతో ప్రారంభమైన శ్రీరెడ్డి సంచలనాల జ్వరం టెలివిజన్ ఛానెల్లకు పాకింది. ప్రముఖ, పలు టెలివిజన్ ఛానెల్లు శ్రీరెడ్డి ఇంటర్వ్యూ కోసం పోటిపడ్డాయంటే ఆమె వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారాయో ఊహించుకోవచ్చు.

నన్ను వాడుకొన్నారు..

నన్ను వాడుకొన్నారు..

పలు ఇంటర్వ్యూలలో పలు విధాలుగా తనకు జరిగిన అన్యాయాన్ని శ్రీరెడ్డి ప్రస్తావించారు. ఓ పెద్ద హీరో తమ్ముడితో డేటింగ్ చేశాను. అతడు వాడుకొన్నాడు కానీ నాకు కెరీర్‌కు ఎలాంటి ఉపయోగం లభించలేదని వాపోయింది. వేషాల ఎర వేసి అలా తనను వాడుకొన్నవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అని శ్రీరెడ్డి ఆరోపించింది.

 సరైన సమయంలో లీక్

సరైన సమయంలో లీక్

తనతో అతిసన్నిహితంగా మెదిగిన వారిలో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు, ఓ అగ్రహీరోల ఫొటోలు, వీడియోలు నా వద్ద ఉన్నాయి. సరైన సమయంలో తాను బయటపెడుతాను అని శ్రీరెడ్డి వెల్లడించింది.

 లీక్స్ స్టార్టెడ్ అని

లీక్స్ స్టార్టెడ్ అని

శ్రీరెడ్డి వెల్లడించిన విధంగానే సినీ పరిశ్రమలో తనతో అతి సన్నిహితంగా మసలుకున్న వ్యక్తుల ఫొటోలను లీక్ చేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి.. తనతో క్లోజ్‌గా ఉన్న ఓ వ్యక్తి ఫొటోను తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆ ఫొటో కింద ‘లీక్స్ స్టార్టెడ్' అని వెల్లడించింది.

లీక్ చేసిన వ్యక్తి

లీక్ చేసిన వ్యక్తి

శ్రీరెడ్డి లీక్ చేసిన వ్యక్తి ఫోటో అసంపూర్తిగా పెట్టింది. దీంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో వణుకు మొదలైందనే ప్రచారం జరుగుతున్నది. శ్రీరెడ్డి నిజంగానే లీకులు పెట్టిందా? లేదా కొందరిని బ్లాక్ మెయిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యక్తుల ముఖాల కనిపించకుండా

వ్యక్తుల ముఖాల కనిపించకుండా

తాజా లీక్స్ వ్యవహారం కేవలం పబ్లిసిటీ కోసమేనా? ఒకవేళ తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలనుకొంటే ఆయా వ్యక్తుల ముఖాలు కనిపించకుండా బయటపెట్టడం కాదు. తమిళనాట సెన్సేషన్ రేపిన సుచీలీక్స్ మాదిరిగా డైరెక్ట్‌గా ఫొటోలు బయటపెడితే శ్రీరెడ్డిని నమ్మడానికి వీలు ఉంటుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

శ్రీరెడ్డి బలిపశువా?

శ్రీరెడ్డి బలిపశువా?

మీడియా ఆడుతున్న రేటింగ్ డ్రామాలో శ్రీరెడ్డి బలి పశువుగా మారింది. టెలివిజన్ ఛానెల్లు తమ రేటింగ్ కోసం వాడుకొంటున్నాయి. ఏదైనా అన్యాయం జరిగితే సినీ పెద్దలు, సంస్థల దృష్టికి తీసుకురావాలి గానీ, ఇలా పబ్లిసిటీ కోసం వాడుకోవద్దు అనే వాదన వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X