నాని వైఫ్‌కు శ్రీరెడ్డి కౌంటర్.. నాతో పడుకున్నప్పుడు, అసభ్యంగా కామెంట్స్!
నేచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు ఆగేలా కనిపించడంలేదు. శ్రీరెడ్డి, నాని వివాదం తారాస్థాయికి చేరేలా కనిపిస్తోంది. నాని తనతో పడుకున్నాడు అంటూ ఇటీవల శ్రీరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో సహనం వహించిన నాని చివరకు శ్రీరెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. వాటిపై శ్రీరెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించింది. చట్టపరమైన చర్యలకు తాను కూడా సిద్ధం అని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని శ్రీరెడ్డి ప్రకటించింది. వివాదంపై నాని సతీమణి అంజనా స్పందిస్తూ పరోక్షంగా శ్రీరెడ్డి తీరుని తప్పుబట్టింది. దీనిపై తాజగా శ్రీరెడ్డి కూడా కౌంటర్ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Recommended Video


శ్రీరామ చంద్రుడు కాదమ్మా
నీ భర్త నువ్వు అనుకున్నట్లు శ్రీరామ చంద్రుడు కాదమ్మా. నాతో నీ భర్త పడుకున్నప్పుడు నువ్వు అక్కడ లేవుగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఓపిక పట్టు
కొన్ని రోజులు ఓపిక పడితే నీ మొగుడు నాలాంటి చాలా మంది అమ్మాయిలతో పడుకున్నాడు అని నిరూపిస్తా అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

డబ్బు, పేరు ఉంటే
డబ్బు పేరు ఉంటే తన భర్త ఎలాంటి వారైనా వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ అవతలి అమ్మాయిలని నిందించకూడదని శ్రీరెడ్డి తెలిపింది. చివరివరకు వేచి చూస్తే నిజం నాపై ఉందని తేలుతుందని శ్రీరెడ్డి పేర్కొంది.

ఆధారాలు లేకుండా నానిని టార్గెట్
ఫ్యామిలీ పేరు ఉన్న నాని లాంటి స్టార్ ని కించపరిచేలా శ్రీరెడ్డి మాట్లాడుతుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే పలు విషయాల్లో శ్రీరెడ్డి విమర్శలని ఎదుర్కొంటోంది. పబ్లిసిటీ పొందడమే తనకు కావాల్సింది.. అందుకే విచక్షణ లేకుండా దారుణమైన వ్యాఖ్యలతో రెచ్చిపోతోందనే విమర్శలు ఎక్కువవుతున్నాయి.

చోటు దక్కలేదనా
శ్రీరెడ్డి కూడా బిగ్ బాస్ 2 లో ఉండే అవకాశం ఉందని ఈ షో ప్రారంభానికి ముందు అంతా అంచనా వేసారు. కానీ శ్రీరెడ్డి బిగ్ బాస్ షోకు ఎంపిక కాలేదు. దీనితో నానిపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే పెదవి విరిచేవారూ లేకపోలేదు. బిగ్ బాస్ 2 ప్రారంభం అయ్యాక తారక్ లాగా షోని నడిపించే దమ్ము ఎవరికీ లేదు అంటూ కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











