Sri Reddy: లంకలో దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సీతను నేనే అంటూ శ్రీ రెడ్డి సంచలన పోస్టు
దగ్గుబాటి అభిరామ్ శ్రీలంకలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంగరంగవైభవంగా శ్రీలంకలో దగ్గబాటి అభిరామ్ పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అయితే తనకు వరసయ్యే ప్రత్యూషను పెళ్లి చేసుకున్నాడు అభిరామ్. ఇక వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్లి ఫోటోలు శ్రీరెడ్డి వరకు చేరగా.. ఆమె సంచలన పోస్టు పెట్టింది. నేను సీతను.. అభిరామ్ రాముడు అంటూ షాకింగ్ పోస్టు చేయగా వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో వరుసగా హీరోలు, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మొన్నటి వరకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటై హనీమూన్లో బిజిగా ఉన్నారు. ఇక రాధ కూతురు కార్తిక, అర్జున్ సర్జా కూతురు పెళ్లి ఇలా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో కుర్ర హీరో పెళ్లి పీటలు ఎక్కాడు. దగ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు.

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో వైభవంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యుల నడుమ డెస్టినేషన్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు చాలా తక్కువ మంది సినీ ప్రముఖుల హాజరయ్యారు. ఇక అభిరామ్ తనకు మరదలు వరుసయ్యే ప్రత్యూషతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీళ్ళ పెళ్లి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్...వీరికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే వీరి పెళ్లి ఫోటోలు శ్రీ రెడ్డి వరకు చేరాయి. దీంతో ఆమె అభిరామ్ పెళ్లిపై షాకింగ్ తన ఫేస్ బుక్ వేదికగా పోస్టు పెట్టింది. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనం దేవతలుగా కొలిచే రాముడిని సీతని విడదీసిన దేశం.. సీతాదేవి శాపాలకు నిలయం ..ఆంజనేయ కోపాగ్నిలో తగలబడిపోయిన దేశం.. అశోకవనంలో సీతమ్మ రాముని కోసం తిండి నిద్రలు మాని దుఃఖితురాలైన ఆ రాక్షస రావణ లంక శ్రీలంకలో దగ్గుబాటి అభిరాం పెళ్లి ... అంటూ రాసుకువచ్చింది.

మన దేశ ఆదర్శ జంట రాములవారిని సీతమ్మ వారిని విడదీసిన దేశంలోనా నీ పెళ్లి?? ఆహా ! దైవ నిర్ణయాన్ని గౌరవిస్తాను..ఎప్పటికైనా రాక్షసులు రాక్షసులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ పోస్టుపై నెటిజన్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అభిరామ్ ఆ దేశంలో పెళ్లి చేసుకోవడం ఎందుకు.. అని.. ప్రశ్నిస్తున్నారు. ఇక శ్రీరెడ్డి, అభిరామ్ వ్యవహారం అప్పట్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. తనను వాడుకుని అభిరామ్ మోసం చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపించింది.
ఇక శ్రీరెడ్డి పోస్టుపై కొంతమంది ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు సీతవి ఆయన రాముడు మరి మధ్యలో ఈ ప్రత్యూష ఎవరు? అని ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది శ్రీరెడ్డి మాటలకు చాలామంది మద్దతు చేస్తున్నారు. శ్రీరెడ్డి బాధలో న్యాయం ఉందని అంటున్నారు. మొత్తానికి అభిరామ్ పెళ్లి చేసేశాడు దగ్గబాటి సురేష్.


Click it and Unblock the Notifications











