ఓ పక్క వ్యభిచారం, మరోపక్క.. పరువు తీసారని స్టార్ హీరోయిన్స్‌ని బహిష్కరిస్తారా.. శ్రీరెడ్డి హాట్ కామ
Recommended Video

చికాగో సెక్స్ రాకెట్ గురించి సంచలన నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేసింది. చికాగోలో టాలీవుడ్ నటీమణుల సెక్స్ రాకెట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో పేరుమోసిన పెద్ద హీరోయిన్లే ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అమెరికా పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. సెక్స్ రాకెట్ నడిపిస్తున్న కిషన్, చంద్ర దంపతులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనని కూడా వాళ్ళు సంప్రదించారని ఇటీవల శ్రీరెడ్డి తెలిపింది. ఈ విషయంలో మా అసోసియేషన్ ని తప్పుబడుతూ శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్స్
కాస్టింగ్ కౌచ్ విషయంలో తమకేమి సంబంధం లేదని ప్రెస్ మీట్స్ పెట్టిన టాలీవుడ్ సినిమా ఫ్యామిలీస్.. చికాగో సెక్స్ రాకెట్ పై కూడా ప్రెస్ మీట్స్ పెట్టాలని శ్రీరెడ్డి తెలిపింది. ఇప్పుడు మాట్లాడే ధైర్యం చేయలేరని ఎద్దవా చేసింది.

మీడియా మీద నిప్పులు
ఆ సమయంలో మీడియాపై నిప్పులు పోశారు. మైకుల ముందు ఊగిపోయి మాట్లాడారు అని శ్రీరెడ్డి తెలిపింది.

ఓ వైపు వ్యభిచారం
ఓ వైపు వ్యభిచారం, మరోవైపు కాస్టింగ్ కౌచ్.. ఏమైంది ఈ సినిమా నగరానికి అటూ శ్రీరెడ్డి సెటైర్స్ వేసింది. చాలా రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న సంగతి తెలిసిందే.

మా అసోసియేషన్
మా అసోసియేషన్ వారు చికాగో సెక్స్ రాకెట్ గురించి ఏం మాట్లాడతారో చూడాలి. ఎప్పటిలాగే తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

అంత ధైర్యం ఉందా
అమెరికా వెళ్లి పరువు తీసుకొచ్చారని స్టార్ హీరోయిన్స్ బహిష్కరిస్తారా.. అంత ధైర్యం ఉందా వీళ్ళకి అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో స్టార్ హీరోయిన్స్ ఉన్నారనే విషయాన్ని శ్రీరెడ్డి చెప్పకనే చెప్పింది.

చీకటి దందాలో
ఈ చీకటి దందా నడిపిస్తున్న వారు మా అసోసియేషన్ లో పెద్ద పోస్ట్ లలో ఉన్నారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. కానీ మాకేం సంబంధం లేదని అని మీడియా ముందు బుకాస్తారని శ్రీరెడ్డి తెలిపింది.


Click it and Unblock the Notifications











