twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆఫీసర్' గ్రేట్ మూవీ, ఆర్జీవీ గ్రేట్ డైరెక్టర్.. మీ ఫ్యామిలీ సినిమాలు వచ్చినప్పుడు.. శ్రీరెడ్డి!

    |

    Recommended Video

    Sri Reddy Sensational Comments On Officer Movie

    నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తోంది. ఓ వైపు కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూనే పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ ఆయన ఫాన్స్ ని రెచ్చగొడుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆర్జీవీ డైరెక్షన్ లో శ్రీరెడ్డి పబ్లిక్ గా వికృత చేష్టలు చేస్తూ పవన్ కళ్యాణ్ తల్లిని తీవ్రమైన పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే ఆ విషయంలో శ్రీరెడ్డి విమర్శలు ఎదుర్కొంది. తాజగా ఆర్జీవీకి సపోర్ట్ చేస్తూ ఆఫీసర్ చిత్రాన్ని శ్రీరెడ్డి ప్రశంసలతో ముంచెత్తింది.

    ఆర్జీవికి మద్దత్తుగా

    ఆర్జీవికి మద్దత్తుగా

    శ్రీరెడ్డి ఇటీవల ఎక్కువగా అర్జీవిని ప్రశంసిస్తూ పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిన ప్రక్రియలో సూత్రధారిని తానే అని ఆర్జీవీ స్వయంగా అంగీకరించిన సంగతి తెలిసిందే.

    ఆఫీసర్ చిత్రం గురించి

    ఆఫీసర్ చిత్రం గురించి

    ఇటీవల శ్రీరెడ్డి ఆఫీసర్ చిత్రం గురించి కూడా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్పందన రావడం లేదు.

    ఆఫీసర్ గ్రేట్ మూవీ

    శ్రీరెడ్డి మాత్రం ఆఫీసర్ గ్రేట్ మూవీ అని ప్రశంసలు కురిపిస్తోంది. నాగార్జున చాలా బాగా నటించారు, రాంగోపాల్ వర్మ గ్రేట్ డైరెక్టర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించింది.

     నెగిటివ్ పబ్లిసిటీ

    నెగిటివ్ పబ్లిసిటీ

    కొంత మంది ఫాన్స్ కావాలనే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. సినిమా చాలా బావుంది అంతా థియేటర్ కు వెళ్లి చూడండి అంటూ శ్రీరెడ్డి కోరింది.

    మీ ఫ్యామిలీ సినిమాలు

    మీ ఫ్యామిలీ సినిమాలు

    సినిమాపై పిచ్చి రాజకీయాలు చేయకండి అంటూ శ్రీరెడ్డి తెలిపింది. ఎలాంటి సందేహం అవసరం లేడకుండా సినిమా చూడండి. మీ ఫ్యామిలీ సినిమాలు విడుదలైనప్పుడు చూసుకుందాం అంటూ వార్నింగ్ ఇచ్చింది.

    కౌంటర్ ఇస్తున్న ఫాన్స్

    కౌంటర్ ఇస్తున్న ఫాన్స్

    సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ తిట్టే శ్రీరెడ్డి.. ఆర్జీవీ సినిమాలకు మాత్రం సపోర్ట్ చేస్తోంది. ప్రేక్షకులంతా తిరస్కరించిన చిత్రానికి శ్రీరెడ్డి సపోర్ట్ చేయడం వెనుకే ఆమె నిజస్వరూపం బయటపడుతోంది కొందరు ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

    English summary
    SriReddy sensational comments on Officer movie. SriReddy warns antifans
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X