పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి మళ్ళీ అటాక్.. అప్పుడు చేయలేదే ధర్నాలు.. మెగా ఫ్యామిలీపై!
Recommended Video
మీడియా సంచలనం శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తెలంగాణాలో సంచలనం సృష్టిస్తున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై శ్రీరెడ్డి తన అభిప్రాయం చెబుతూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో శ్రీరెడ్డి కేసీఆర్ కు మద్దతు తెలిపింది. ప్రతిపక్షాలకు, తల్లిదండ్రులకు ఇప్పడే ధర్నాలు, ఆందోళనలు గుర్తొచ్చాయా అంటూ వ్యాఖ్యానించింది. ఇంతకీ శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడిందో వివరాల్లో చూద్దాం!

నోట్ల రద్దు సమయంలో
శ్రీరెడ్డి తెలంగాణ విద్యార్థుల విషయంలో ప్రతిపక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ధర్నాలని తప్పుబట్టింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కేసీఆర్ గారిని ఎందుకు నిందిస్తున్నారు. ఇందులో ఆయన తప్పేముంది అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. నరేంద్ర మోడీ పెద్ద నోట్లని రద్దు చేశారు. దానివలన ఎలాంటి ఉపయోగం జరగకపోగా దాదాపు నెలరోజుల పాటు కరెన్సీ కోసం అందరూ నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఈ తల్లిదండ్రులకు, ప్రతిపక్షాలకు మోడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని అనిపించలేదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. అంతా ఓపిగ్గా వెళ్లి క్యూలో నిలుచుని మరీ ఏటీఎం వద్ద డబ్బు తీసుకున్నారు. అప్పుడు మోడీని తప్పుపట్టనివాళ్ళు ఇప్పుడు కేసీఆర్ ని ఎందుకు నిందిస్తున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

ఒక ఫ్యామిలీ వల్ల
టాలీవుడ్ లో టాప్ కు చేరుకోవాల్సిన నటుడు ఓ ఫ్యామిలీ వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ సమయంలో ధర్నా చేయాలని ఈ జనాలకు అనిపించలేదా అని శ్రీరెడ్డి పరోక్షంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి దీనిని అందరూ రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఓ పార్టీ వచ్చింది.. చాలా మంది నమ్మి ఓట్లు వేశారు.. దానిని తీసుకెళ్లి మరో పార్టీలో కలిపేశారు.. అది తప్పు కదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

పవన్‌పై అటాక్
ఒక వ్యక్తిని వివాహం చేసుకుని కొంతమంది మహిళలు బలైపోయారు అంటూ శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళ తరుపున ధర్నాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఏంటి అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. సినిమాలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ తమ్ముడు చనిపోబోతుంటే వీళ్లంతా ఏమయ్యారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

తెలంగాణ కోసం
తెలంగాణ పోరాటంలో ఎంతోమంది విద్యార్థులు బలిదానాలకు గురయ్యారు. ఆ సమయంలో ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఇప్పుడు ధర్నాలు చేస్తున్న తల్లిదండ్రులంతా ఆ సమయంలో ఏమయ్యారు.. అంటే మీ పిల్లల ప్రాణాలకే విలువ.. తెలంగాణ కోసం మరణించిన వారి ప్రాణాలకు విలువ లేదా అని శ్రీరెడ్డి ప్రశ్నించింది.


Click it and Unblock the Notifications











