పవన్ కళ్యాణ్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, తల్లిని తిడుతూ.. పైగా సంజాయిషీ!

Recommended Video

Pawan Kalyan Severly Blamed By Sri Reddy

శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘ నాయకురాళ్లు, జూనియర్ ఆర్టిస్టుల మద్దత్తు లభిస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో కొందరు జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న వారు పవన్ కళ్యాణ్ కు ఓటు వేయవద్దంటూ ఓ నటి ప్రస్తావించడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం రోజు శ్రీరెడ్డి మీడియా ముందు పవన్ కళ్యాణ్ గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై ప్రస్తుతం దుమారం రేగుతోంది.

కొనసాగుతున్న శ్రీరెడ్డి పోరాటం

కొనసాగుతున్న శ్రీరెడ్డి పోరాటం

గత నెల రోజులుగా శ్రీరెడ్డి టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలపై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పోరాటానికి మహిళా సంఘాల వారు మద్దత్తు తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ స్పందన

పవన్ కళ్యాణ్ స్పందన

శ్రీరెడ్డి పోరాటం గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ స్పందించారు. న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలనీ పవన్ కళ్యాణ్ సూచించారు. అంతే కానీ మీడియా సంస్థల్లో చర్చ కార్యక్రమాల్లో కూర్చుంటే న్యాయం జరగదని పవన్ వ్యాఖ్యానించారు.

ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ టార్గెట్

ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ టార్గెట్

ఆ తరువాత శ్రీరెడ్డి, కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కొన్ని విమర్శలు చేశారు. పవన్ పై విమర్శలు చేయడంతో ఆయన అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది.

దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

దారుణమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

సోమవారం మీడియాతో మాట్లాడిన శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. పవన్ తల్లిని తిడుతూ పేర్కొనలేని పరుష పదజాలాన్ని ఉపయోగించింది. దీనితో పవన్ ఫాన్స్ శ్రీరెడ్డిపై మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ ని 'అన్న' అన్నందుకు

పవన్ కళ్యాణ్ ని 'అన్న' అన్నందుకు

పవన్ కళ్యాణ్ ని తాను అన్న అని పిలిచానని ఆయన స్పందన విన్నాక తనని తాను శిక్షించుకోవాలని మీడియా ముందు శ్రీరెడ్డి పాదరక్షలతో కొట్టుకుంది. ఇక మీదట ఏమహిళా పవన్ కళ్యాణ్ ని అన్నా అని పిలవదు అని మాట్లాడింది.

 సంజాయిషీ ఇచ్చిన శ్రీరెడ్డి

సంజాయిషీ ఇచ్చిన శ్రీరెడ్డి

పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తాజాగా శ్రీరెడ్డి తన వ్యాఖ్యలకు సంజాయిషీ ఇచ్చుకుంది. తాను పవన్ కళ్యాణ్ తల్లికి మాత్రమే క్షమాపణ చెబుతానని.. పవన్, పవన్ ఫాన్స్ కు చెప్పనని తెలిపింది. పవన్ కళ్యాణ్ స్పందన, ఆయన అభిమానులు పెట్టిన కామెంట్ల వలనే తాను అలా మాట్లాడవలసి వచ్చిందని శ్రీరెడ్డి పేర్కొంది.

పరోక్షంగా స్పందించిన కోన వెంకట్

పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి దారుణమైన వ్యాఖ్యలు చేయడంతో ప్రముఖ రచయిత కోన వెంకట్ స్పందించారు. జరిగిన ఘటనతో తాను కలత చెందానని అన్నారు. అయినా కూడా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయవద్దని పవన్ ఫాన్స్ కు పరోక్షంగా సూచించారు. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఎవరూ తాకలేరని అన్నారు. ఆయన చాలా పెద్ద కార్యం కోసం బిజీగా ఉన్నారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X