twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ తప్పేముంది.. సూసైడ్స్‌కి కారణం తల్లిదండ్రులే.. తెలంగాణ విద్యార్థులపై శ్రీరెడ్డి హాట్ కామెంట్

    |

    గత ఏడాది కాస్టింగ్ కౌచ్ పై పోరాటంతో శ్రీరెడ్డి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మీడియాలో పెద్ద ఎత్తున శ్రీరెడ్డి వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అనేక సంచలనాలు చోటు చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇటీవల శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ప్రస్తుత విషయాల గురించి మాట్లాడుతోంది. తెలంగాణాలో సంచలనం సృష్టిస్తున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై శ్రీరెడ్డి తన అభిప్రాయం చెబుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో శ్రీరెడ్డి కేసీఆర్ కు మద్దతు తెలిపింది.

    ఇంటర్ బోర్డులో అవకతవకలు

    ఇంటర్ బోర్డులో అవకతవకలు

    కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు 15 మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మ హత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకల వల్ల కొందరి విద్యార్థుల ఫలితాలు తారుమారైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనితో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి, ఇంటర్ బోర్డుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

    తల్లిదండ్రులదే తప్పు

    తల్లిదండ్రులదే తప్పు

    ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు విషయంలో శ్రీరెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని నిందిస్తున్నారు. విద్యార్థుల ఆత్మ హత్యలకు కేసీఆర్ ఎలా బాధ్యులు అవుతారని శ్రీరెడ్డి ప్రశ్నించింది. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మన విద్యా వ్యవస్థ, తల్లిదండ్రుల పెంపకమే కారణం అని శ్రీరెడ్డి ఆరోపించింది. పిల్లలపై అనవసరమైన ఒత్తిడి పెంచి వారి చావుకు కారణమైంది తల్లిదండ్రులే. గతంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ తల్లిదండ్రులంతా పోరాటం చేకుండా ఏమయ్యారు అని ప్రశ్నించింది.

    ధైర్యంగా ఉండాలి

    ధైర్యంగా ఉండాలి

    ఒక వేళ ఇంటర్ బోర్డులో అవకతవకలు జరిగి ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విషయాన్ని తల్లి దండ్రులు పిల్లలకు చెప్పాలి. వారు ధైర్యంగా ఉండేలా చేయాలి. విద్యార్థులు అంతా ధైర్యంగా ఉండాలని శ్రీరెడ్డి సూచించింది. తల్లి దండ్రులు తమ పిల్లలు డబ్బు ఎలా సంపాదించాలి అనే కోణంలోనే పెంచడం వలన ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. పెళ్లి విషయంలో కూడా కట్నం బాగా వస్తే చాలు.. అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు అనే విధంగా తల్లిదండ్రులు ఉన్నారు అని శ్రీరెడ్డి ఆరోపించింది.

    ప్రతిపక్షాల రాజకీయం

    ప్రతిపక్షాల రాజకీయం

    గతంలో ఎన్నో సమస్యలు వచ్చాయి.. అప్పుడు నాకు ఎక్కడా ప్రతిపక్ష పార్టీలు కనిపించలేదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. విద్యార్థుల ఆత్మహత్యలని రాజకీయం చేయడం కోసం విజయశాంతి లాంటి వారంతా ధర్నాలు చేస్తున్నారు అంటూ శ్రీరెడ్డి విమర్శించింది. రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు ఉంటారు. వారు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ ని విమర్శించడం ఏంటి అని శ్రీరెడ్డి ప్రశ్నించింది. విద్యార్థులు ఇలా పిరికోళ్లలా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

    English summary
    SriReddy Sensational Comments on Telangana Inter students suicides
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X