గోపీచంద్, నయన మూవీ : భూపతి ఔట్, శ్రీవాస్ ఖరారు
గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈచిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మిస్తున్నారు. కొముర వెంకటేష్ ఈచిత్రానికి సమర్పకులు. భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే తాజాగా అతన్ని తప్పించి లక్ష్యం ఫేం శ్రీవాస్‌ను ఖరారు చేశారు. గోపీచంద్ ఈ సబ్జెక్ట్ లో తన దైన శైలిలో మార్పులు చెప్పటం వల్ల భూపతి హర్ట్ అయి తప్పుకున్నాడని టాక్. శ్రీవాస్ దర్శకత్వంలో ఆగస్టు నెలలో సినిమా మళ్లీ ఫ్రెష్‌గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈచిత్రం గురించి నిర్మాతలు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
ఈ చిత్రం గురించి వివరిస్తూ...గోపీచంద్‌తో కలిసి లక్ష్యం వంటి సెన్సేషన్ హిట్ అందించిన దర్శకుడు శ్రీవాస్‌ల కలయికతో మేము ఈ భారీ చిత్రాన్ని చేస్తున్నాము. దర్శకుడు చెప్పిన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ హీరో గోపీచంద్ విని వెంటనే ఓకే చేశారు. ఇప్పుడు దీనికి సబంధించినటువంటి స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. ఆగస్టు ప్రథమార్థంలో సంగీత ముహూర్తం జరిపి, ఆ వెంటనే షూటింగ్ ప్రారంభోత్సవం చేసి సింగిల్ షెడ్యూల్ లోనే నాన్ స్టాప్ గా చిత్ర నిర్మాణాన్ని జరిపేందుకు సర్వ సన్నాహాల్ని చేస్తున్నామన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం ఎంపిక ఇంకా జరుగాల్సి ఉంది. తమన్ సంగీతం అందించనున్న ఈచిత్రానికి మిగిలిన సాంకేతిక నిపుణుల ఎన్నిక జరుగుతోంది. సమర్పణ: కొముర వెంకటేష్, నిర్మాత: తాండ్ర రమేష్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications











