మున్నాలో తళుక్కుమనే శ్రియ
కన్నడంలో శివరాజ్‌కుమార్ హీరోగా హిట్ అయిన జోగి సినిమాని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా ఇలియానా హీరోయిన్‌గా కొత్త దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్దేశకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటి శ్రియ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఒక ఐటెమ్ సాంగ్‌లో శ్రియ తళుకుబెళుకులు ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో రాజు సుందరం కొరియోగ్రఫీలో శ్రియ, ప్రభాస్‌లపై ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
దేవదాసు చిత్రంలో కూడా శ్రియ ఒక ఐటెమ్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. శివాజీ చిత్రంలో హీరోయిన్‌గా నటించాక, తెలుగులో అవకాశాలు లేని శ్రియ మళ్లీ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ కావడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications