లేటు అవుతోందంటూ డైరక్టర్ పై సూపర్ స్టార్ సీరియస్
రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది..ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాలేదు అంటూ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ దర్శకుడు అనుభవ్ సిన్హాపై సీరియస్ అయ్యారు. ఆయన దీపావళికి విడుదల కానున్న రా వన్ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతన్న స్టూడియోకి వెళ్లి చూసారు. అక్కడ అంతా చాలా టెన్షన్ తో వర్క్ చేస్తున్నారు. సినిమాలో ఎక్కువ భాగం యానిమేషన్ కావటంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఇబ్బందిగా మారింది. ఇక ఈ విషయమై అనుభవ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ...అంతా సవ్యంగానే ఉంది. పోస్ట్ ఫ్రొడక్షన్ టైమ్ లో ఇటువంటి టెన్షన్స్ కామన్. సినిమా విడుదలై విజయవంతం అయితే అన్ని మర్చిపోతాం అన్నారు. ఇక షారుఖ్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'రా.వన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించాలని కోరుకుంటున్నాడు. ఈ చిత్రం దీపావళి రోజైన అక్టోబర్ 26న విడుదల కానుంది. ఒకప్పటి ప్రత్యర్థి సల్మాన్ చిత్రాలు సాధించిన ఘన విజయాల్ని ప్రస్తావించిన షారుఖ్, సల్లూభాయ్‌తో తాను పోటీపడటం లేదని పేర్కొంటూనే రా.వన్ పాత రికార్డ్‌లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.
''ప్రతి సినిమాకూ దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మూడునాలుగు సినిమాలు మంచి బిజినెస్ చేశాయి. బాక్సాఫీస్ విషయానికొస్తే ఈ నా కొత్త సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఆ చిత్రాలు సాధించిన విజయాన్ని మేమూ అందుకోగలమని ఆశాభావంతో ఉన్నాను'' అని మీడియాతో అంటున్నాడు. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ హీరో చిత్రం 'రా.వన్'లో షారుఖ్, కరీనా కపూర్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల కంటే భారీ వ్యయంతో సిద్ధమవుతున్న రా.వన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3డి ఫార్మాట్‌లో తమిళ్, తెలుగు, జర్మన్ భాషల్లో డబ్బింగ్‌తో విడుదలవుతుంది. ''నేను భారీ వ్యయంతో ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నా వెంట నిలిచిన పార్టనర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. వాళ్ళు డబ్బు పెట్టినందుకు కాదు, నా సినిమా మీద నమ్మకముంచినందుకు. ఆ సొమ్ము తిరిగి రావాలంటే గతంలో ఎన్నడూ జరగనంత బిజినెస్ జరగాలి'' అని తన కోరిక వెల్లబుచ్చాడు.


Click it and Unblock the Notifications











