బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'షారుఖ్' గేమ్
బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇది మాత్రమే కాకుండా కొల్‌కత్తాలో 17వ తారీఖున నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరగనున్న కొల్‌కత్తా ఫిల్మ్ ఫెస్టివల్‌కి ముఖ్య అతిధిగా షారుఖ్ ఖాన్ రానున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోననున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అడగడం వల్లనే బాద్ షా షారుఖ్ 'బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్'గా ఉండేందుకు ఒప్పుకొవడం జరిగిందని సమాచారం. 17న నేతాజీ ఇండొర్ స్టేడియంలో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్‌లో మమత బెనర్జీ, షారుఖ్ కలసి టిటి-యా-టిటి గేమ్‌ని సరదాగా అభిమానుల కొసం ఆడనున్నారు.
షారుఖ్ ఖాన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొల్‌కత్తా నైట్ రైడర్స్‌ని కొనుగొలు చేసిన విషయం తెలిసిందే. షారుఖ్‌తో పాటు జూహిచావ్లా కూడా ఫ్రాంచైజీ ఓనర్స్ గా కొనసాగుతున్నారు. ఇది ఇలా ఉంటే ఐపిఎల్‌లో రెండవ ఎడిషన్‌లో కొల్ కత్తా ప్రాంచైజీ ఓనర్ షారుఖ్ కొన్ని అవకతవకలు పాల్పడ్డారంటూ ఇటీవల ఈడి షారుఖ్‌ని ప్రశ్నించిన సందర్బంలో ఇలా, బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పుకొవడం విశేషం.


Click it and Unblock the Notifications











