క్షురకులకు మెగా హీరో ఆహ్వానం...

రజనీకాంత్ హీరోగా చేసిన కథానాయుకుడు సినిమా ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టి,ఎంత నష్టం మిగిల్చిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడదే హిస్టరీ హిందీ భిల్లో బార్బర్ సినిమాకీ ఎదురవుతోంది. కథానాయుకుడు రీమేక్ గా తయారయిన ఈ చిత్రంలో టైటిల్ లో ఉన్న బార్బర్ అనే పదం తమ కులాన్ని అవమానపరుస్తోందని,అది తమకు అన్నం పెట్టే వృత్తిఅని ముంబయి సెలోన్ అండ్ హెయిర్ డ్రెస్సర్స్ అశోసియేషన్ ప్రెసెడెంట్ మండిపడుతున్నారు. ఆయన ఆ చిత్ర నిర్మాత(రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్ మెంట్స్ )షారూఖ్ ఖాన్ ని తప్పుపట్టారు.
దీనికి సమాధానంగా షారూఖ్ ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ...వారి ఆవేదన అర్ధమైందని,తాము అంత దూరం ఆలోచించలేదని,భిల్లో బార్బర్ పోస్టర్స్ ,హోర్డింగ్స్ లలో బార్బర్ అనే పదాల వద్ద పేపర్ అంటించి మూసివేస్తామని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఇండియా అంతటా పాటిస్తామన్నారు. ఇలాంటి సమస్యే గతంలో ..కథానాయుకుడుకి ఎదురైంది.దర్శకుడు పి.వాసు ఇంటివద్ద చెన్నై క్షౌరకసంఘం వారు దాదాపు మూడు వందల మంది దర్నా చేసారు. అలాగే భిల్లో బార్బర్ కి మార్కెటింగ్ కూడా సమస్య అవుతోంది. దీంతో అంతా ఈ సినిమా సబ్జెక్ట్ లోనే కాక ప్రొడక్షన్ లోనూ క్షవరం జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











