కాపీకేసులో షారూఖ్..పరిహారం 40 కోట్లు
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఇప్పుడో కాపీ కేసులో ఇరుక్కున్నారు. ఆయన నలభై కోట్లు చెల్లిస్తేనే ఊరుకుంటామని,లేకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే షారూఖ్ హీరోగా నటించి, నిర్మించిన 'రా.ఒన్" వచ్చే నెల విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు షారుక్. ఇందులో భాగంగా ఓ మొబైల్ గేమ్‌ని ఇటీవల విడుదల చేశారు. ఈ గేమ్ ద్వారా 'రా.ఒన్"కి కావల్సినంత ప్రచారం లభిస్తోంది. అయితే.. తన ఆలోచనని షారుక్ తస్కరించారని, ఈ మొబైల్ గేమ్ ఐడియా తనదని బెంగళూరుకు చెందిన షకీర్ అగా అనే వ్యాపారవేత్త ఆరోపించారు. తొలుతగా ఈ గేమ్ గురించి షారుక్ తన దగ్గరే డిస్కస్ చేశారని షకీర్ పేర్కొన్నారు. గత ఏడాది యూఎస్‌కి చెందిన లిడా దగ్గర ఈ మొబైల్ గేమ్ గురించి చర్చలు జరిపి, ఆ వివరాలను షారుక్ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఛీప్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న బ్లెస్సన్ మెయిల్‌కి పంపించానని, అందుకు బదులుగా త్వరలో కలుద్దామని అతను రిప్లయ్ ఇచ్చాడని షకీరా అన్నారు. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎస్సెమ్‌ఎస్‌లు ఇచ్చినా, మెయిల్స్ పంపించినా.. బ్లెస్సన్ నుంచి సమాధానం రాలేదని, ఇటీవల ఓసారి షారుక్ త్వరలో మిమ్మల్ని కలుస్తారని మాత్రం చెప్పారని షకీర్ పేర్కొన్నారు. మరింత వివరంగా చెబుతూ ఆయన -''బ్లెస్సన్ చెప్పిన ప్రకారం షారుక్ నన్ను సంప్రదించలేదు సరి కదా.. మొబైల్ గేమ్‌ని విడుదల చేసేశారు. మా ప్లాన్‌ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నాకు 40 కోట్లు రావాలి. ఈ 40 కోట్లు కనుక షారుక్ నాకు ఇవ్వకపోతే.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను""అన్నారు షకీర్.


Click it and Unblock the Notifications











